రైలు ఢీకొని జ్యూట్‌ మిల్లు కార్మికుడు దుర్మరణం | juit mill worker died to hit train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని జ్యూట్‌ మిల్లు కార్మికుడు దుర్మరణం

Published Sun, Aug 28 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

juit mill worker died to hit train

ఏలూరు అర్బన్‌ : రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జ్యూట్‌ మిల్లులో పనిచేస్తున్న పెంటకోటి అప్పారావు (55) ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ మరడాని రంగారావు కాలనీలో నివశిస్తున్నాడు. అప్పారావు శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనులపై అతను రామకృష్ణాపురం వెళ్లేందుకు సీఆర్‌ఆర్‌ కళాశాల సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. రైలు పట్టాలపై మృతదేహాన్ని చూసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement