7న కాపు జేఏసీ సమావేశం
Published Sat, Nov 5 2016 11:08 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
కిర్లంపూడి:
ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సిఎల్ రోడ్డులో ఉన్న కాపు కల్యాణ మండపంలో నిర్వహించే తూర్పు గోదావరి జిల్లా కాపు జేఏసీ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. శనివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16న మాజీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న కాపు సత్యాగ్రహ యాత్రను దిగ్విజయం చేయడానికి చర్చించే నిమిత్తం 7న జేఏసీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని కాపు నాయకులు, జేఏసీ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గొల్లపల్లి కాశీవిశ్వనాధం, గౌతు స్వామి, కుంపట్ల సత్యన్నారాయణ చల్లా సత్యన్నారాయణ, దాడి సూరిబాబు, దోమాల తమ్మిరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement