కాపు ఉద్యమానికి ప్రత్యేక కమిటీలు
కాపు ఉద్యమానికి ప్రత్యేక కమిటీలు
Published Fri, Aug 5 2016 11:18 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
కాకినాడ రూరల్ :
కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా ప్రత్యేక కమిటీలు వేయనున్నట్టు కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి సహకరించేందుకు ఆరుగురితో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాౖటెందన్నారు. దీని ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 30 మందికి తగ్గకుండా నియోజకవర్గ జేఏసీలను ఏర్పాటు చేయనున్నట్టు ఏసుదాసు వివరించారు. ఇప్పటికే కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ కమిటీల నియామకం జరిగిందన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియమించిన మంజునాథ కమిషన్ ఇప్పటి వరకూ ఎక్కడా పర్యటించలేదన్నారు. ఈ కమిషన్ ఏడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఇప్పటికే ఆరు నెలలు పూర్తయిందని చెప్పారు. దీనికి నెల రోజులు మాత్రమే వ్యవధి ఉన్నందున కాపు జేఏసీల ఆధ్వర్యాన గ్రామ గ్రామానా తిరిగి కాపుల స్థితిగతులను సేకరించి కమిష¯Œæకు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ జేఏసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏసుదాసు వివరించారు. కమిషన్ నివేదిక వేగవంతంగా ఇవ్వాలని, కాపులను బీసీల్లో చేర్చే చర్యలు చేపట్టాలని కోరుతూ నియోజకవర్గ జేఏసీల ఆధ్వర్యాన కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. సమావేశంలో కాపు నాయకులు తొగరు మూర్తి, యాళ్ల అయ్యన్న, బస్వా ప్రభాకరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement