ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉత్తుత్తి హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకుల పాడు నారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
ప్రజలను మభ్యపెడుతున్న కేఈ
Published Wed, May 10 2017 11:45 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- చెరువులు నింపుతామని చెపి్ప ఇప్పటి వరకు పట్టించుకోలేదు
-జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు
- తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
– విలేకరుల సమావేశంలో చెరుకులపాడు నారాయణరెడ్డి
వెల్దుర్తి రూరల్: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉత్తుత్తి హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకుల పాడు నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. పెరవలి రంగస్వామి సమక్షంలో నూరు రోజుల్లో 106 చెరువులు నింపుతానని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈప్రాంతంలోని చెరువులు నింపుతారో..లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందని, జనం గొంతు తడుపుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మంత్రులు, అధికారులు జిల్లాలో భూగర్భజలాలు పెరిగాయంటున్నారని మరి నీటిసమస్య ఎందుకు తలెత్తిందో తెలపాలన్నారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రవిరెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకటనాయుడు, నాయకులు అగస్టీన్, బొమ్మిరెడ్డిపల్లె రంగయ్య, ఆటో మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement