భవనాన్ని పరిశీలిస్తున్న సీపీ సుధీర్‌బాబు
ఇల్లందకుంట(జమ్మికుంట రూరల్) : ప్రభుత్వం ఇల్లందకుంటను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో స్టేషన్ ఏర్పాటుకు భవనం కోసం పోలీస్ అధికారులు అన్వేషిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గొట్టె సుధీర్‌బాబు బుధవారం సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలోని టీటీడీ అతి«థిగృహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇల్లందకుంట వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో భాగం కానున్నట్లు సూచన ప్రాయంగా తెలిసిందన్నారు. కొత్త మండలాలు సిరిపురం, వేలేరు, ఐనవోలు మండలాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయని, అక్కడ కూడా భవనాలు పరిశీలించామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతామన్నారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుధీర్‌బాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట హుజురాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి, టౌన్ సీఐ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, ఆలయ ఈవో సీడీ రాజేశ్వర్, చైర్మన్ కంకణాల సురేందర్‌రెడ్డి, ఎస్సైలు తౌటం గణేశ్, సతీశ్ ఉన్నారు.