తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యం
Published Wed, Aug 3 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఊట్కూర్ : తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీఎచ్‌ఈఓ కతలప్ప అన్నారు. మంగళవారం పులిమామిడి ప్రభుత్వ ఆస్పత్రితో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాల తాగించాలని వాటి ద్వార వ్యాధినిరోధక శక్తి లభిస్తుందని తెలిపారు. గర్భిణిలకు ముర్రుపాలపై అవగాహన కల్పించాలని ఆశ వర్కర్లకు సూచించారు. వారం రోజుల పాటు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాలని అన్నారు. ఈ నెల 10 నూలిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించాలని, 2–19 సంవత్సరాల వారికి నూలిపురుగుల మాత్రలను ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ సురేష్, ఏఎన్‌ఎంలు గోవిందమ్మ, చిట్టెమ్మ, అంబుబాయి, చెన్నమ్మ, ఆశావర్కర్లు మంజుల, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement