మూగజీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి | Must be vigilant in case of mugajivala | Sakshi
Sakshi News home page

మూగజీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

Published Fri, Jul 29 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌

భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌

  •  ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌
  • రఘునాథపాలెం : వర్షాకాలంలో మూగజీవాల ఆరోగ్య విషయంలో పశు వైద్యులు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వేపకుంట్లలో రూ.7.5 లక్షలతో నిర్మాణం చేసిన గోపాల మిత్ర పశువైద్య శిబిరం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ ఆర్‌.రమేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమల అభివద్ధికి కూడా ప్రభుత్వం కషి చేస్తుందని, ప్రభుత్వ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4  అందిస్తోందన్నారు. పాడి పశువుల ద్వారా మంచి అదాయం వస్తోందని, మేలుజాతి పాడి పశువులను పెంచి ఆర్థికంగా లాభాలను పొందవచ్చని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో పాడి గేదెలతోపాటు, గొర్రెలు, మేకలు పెద్ద మొత్తంలో ఉన్నాయని అందుకు అనుగుణంగా వైద్యులును ఏర్పాటు చేయాలని పశుసంవర్ధకశాఖ జేడీ రఘోత్తమరెడ్డికి సూచించారు.

    హరితహారంలో భాగంగా ప్రతి ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలన్నారు. ఇంకా సభలో ఎంపీపీ మాలోత్‌ శాంత, జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, ఏడీలు శ్రీనివాసరావు, జైన్, పశువైద్యాధికారి డాక్టర్‌ కిషోర్, ఎంపీటీసీ రెంటాల ధానయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్‌ రామారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరమణ, హనుమంతురావు, కోదండరాములు, వెంకటేశ్వర్లు, పశువైద్య సిబ్బంది ఆరోగ్య మిత్ర తదితరులు పాల్గొన్నారు. పశువైద్యశాల నిర్మాణానికి స్థలాన్ని దానంగా ఇచ్చిన దాత మంకెన నాగేశ్వరరావును ఎమ్మెల్యే, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధిలు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

పోల్

Advertisement