బీమా క్లెయిముల్లో జాప్యం లేదు
Published Sat, Aug 6 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
ఏలూరు మెట్రో : జిల్లా ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయంలో వినియోగదారుల క్లెయిముల విషయంలో ఎటువంటి జాప్యం జరగడం లేదని ఏపీజీఎల్‌ఐ ఉప సంచాలకులు కె.మహేందర్‌రెడ్డి తెలిపారు. గత నెల 30వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన ‘మేమింతేనోయ్ నిదరోతమ్’ అను శీర్షికపై ఆయన వివరణ ఇచ్చారు. బీమా కార్యాలయంలో బీమా క్లెయిములు, రుణాల మంజూరులో ఎటువంటి ఫిర్యాదులూ తమ దృష్టికి రాలేదని ఆయన పేర్కొన్నారు.
ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 20 రోజుల్లో రుణాలను, వివిధ బీమా క్లెయిములు పరిష్కరించి చందాదారుని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు లక్ష్యం పూర్తి చేస్తున్నామని చెప్పారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ఫొటోపైనా ఆయన స్పందించారు. కార్యాలయంలో తన టేబుల్‌పై నిద్రపోయేందుకు పడుకోలేదనీ, భోజనం అయిన తరువాత గుండెనొప్పితో బాధపడుతుంటే కార్యాలయ సిబ్బంది సహాయంతో టేబుల్‌పై సూపరింటెండెంట్‌ను పడుకోపెట్టారని వివరణ ఇచ్చారు. గత నెల 30వ తేదీన తాను హైదరాబాద్‌లో తమ కార్యాలయంలో పని ఉండటంతో వెళ్లానని వివరించారు.
Advertisement