మోత్కూరులో ‘వింత జంతువు’!
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూ రు సమీపంలో వ్యవసాయ పొలాల్లో శనివారం ఓ వింత జంతువు చిక్కింది. గ్రామానికి చెందిన జినుకల రామనర్సయ్య బావి పరిసరాల్లో కొన్ని రోజులుగా ఓ జంతువు రాత్రి సమయంలో కోళ్లను తింటుంది. దీంతో బోను ఏర్పాటు చేయగా అందులో చిక్కుకుంది. ఈ జంతువు రెండు అడుగుల పొడవు, అడుగున్నర ఎత్తు, వెన్నుపై తెల్లటి, నల్లటి సారుకలు, గుబురు వెంట్రుకలు, ఎలుగుబం టిని పోలిన పాదాలు కలిగి ఉంది. 2 అడుగులకు పైగా పొడవైన తోక ఉంది. కాగా, జంతువును అటవీశాఖ అధికారులకు అప్పగించారు.