
'వరంగల్ ప్రజలకు రుణపడివుంటా'
వరంగల్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే వరంగల్ లో తనను గెలిపిస్తున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో విజయం దిశగా దూసుకెళుతుండడంతో ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం వల్లే భారీ మెజారిటీతో తాను గెలవబోతున్నట్టు చెప్పారు.
తనకు భారీ విజయాన్ని అందిస్తున్న వరంగల్ ప్రజలకు రుణపడివుంటానని అన్నారు. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీయిచ్చారు. కేసీఆర్ తనపై పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు.