- పేద ప్రజలకు ఎల్లప్పుడు వైద్యాన్ని
- అందుబాటులో ఉంచాలి
- సిబ్బంది కొరతను త్వరలో తీరుస్తాను
- అవార్డు రావడం సంతోషదాయకం
- ప్రభుత్వ ఆస్పత్రుల తీరు మెరుగు పడాలి
- డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్:ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతిఒక్కరికి మెరుగైన చికిత్సలు అందించి ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా సేవలందించాలని, లేని పోని సాకులు చెబుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్లు చేయవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో వైద్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రికి వచ్చేది నిరుపేదలేనని అలాంటి వారికి మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. తప్పని పరిస్థితి అయితే కాని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్లు చేయవద్దన్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలవరీలు చేసి ఉత్తమ అవార్డును కైవసం చేసుకోవటం వైద్యులకు వృత్తి మీద ఉన్న అంకిత భావాన్ని తెలియసేస్తుందన్నారు. ఆస్పత్రిలోని వైద్యుల పోస్టులను త్వరలో ¿¶ ర్తీ చేస్తానని పేర్కొన్నారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుని నాటిన ప్రతిమొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఇప్పటికే ఆస్పత్రిలో హైరిస్క్‌కేంద్రం ఏర్పాటు చే సి నిరుపేద మహిళలకు మెరుగైన వైద్యం అందించటం జరుగుతుందన్నారు. త్వరలో ఇటీవలే రూ.12 లక్షలతో అధునాతన ఎక్స్‌రేను సైతం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇప్పటికే డయాల్సిస్, ఐసీయూలను మంజూరు చేయించటం జరిగిందని, త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆస్పత్రి నుంచి 200 పడకల ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. అలాగే మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మరో 50 పడకల ఆస్పత్రికి సైతం ప్రతిపాదనలు పంపటం జరిగిందని చెప్పారు. వాటిని త్వరలోనే మంజూరు చేయించి నిరుపేదలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెస్తానని చెప్పారు. వైద్యులు ప్రజాప్రతినిధులు ఎప్పుడు అలర్టుగా ఉండి ప్రజలకు సేవలందిస్తేనే ఎంచుకున్న వృత్తికి న్యాయం చేస్తామన్నారు. అంతకు ముందు ఆస్పత్రి సూపరిటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో 4 వైద్యుల పోస్టులు కాలీగా ఉన్నాయని వాటిని ¿¶ ర్తీ చేయాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మెన్ అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, నాయకులు వెంకటరమణ, చంద్రకళ, గంగాధర్, కృష్ణారెడ్డి, డీఎస్పీ నాగరాజు, సీఐలు రామకృష్ణ, సాయిఈశ్వర్‌గౌడ్, వైద్యులు పి చంద్రశేఖర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.