పొందుర్తి విద్యార్థులకు బంగారు పతకాలు
పొందుర్తి విద్యార్థులకు బంగారు పతకాలు
Published Mon, Aug 15 2016 10:01 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
భిక్కనూరు : మండలంలోని పొందూర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వాతావరణ కాలుష్యం–నిర్మూలన, నీటి కాలుష్య నివారణ, నీటి శుద్ధీకరణ తదితర అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఇందులో పొందూర్తి పాఠశాలకు చెందిన భార్గవి, నిఖిత, సుచరిత, రోహిత్, దివ్య ప్రతిభ చూపి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఎంఈవో భూపాల్‌రెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. సత్తా చాటిన విద్యార్థులతో పాటు హెచ్‌ఎం అశోక్, ఆర్ట్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుడు ప్రసాద్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ బాల్‌రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement