రైల్వే విశ్రాంతి గదుల బుకింగ్‌ ఇలా... | railway rest rooms booking details | Sakshi
Sakshi News home page

రైల్వే విశ్రాంతి గదుల బుకింగ్‌ ఇలా...

Published Fri, May 26 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

రైల్వే విశ్రాంతి గదుల బుకింగ్‌ ఇలా...

రైల్వే విశ్రాంతి గదుల బుకింగ్‌ ఇలా...

నిత్య జీవనంలో ప్రతి ఒక్కరికీ రైల్వే ప్రయాణ అవసరం ఉంటుంది. ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లాలన్నా.. పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, రాజధానులకు ఎక్కడికెళ్లాలన్నా..రైళ్లను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న జీవన పరిస్థితులకనుగుణంగా నేడు రైల్వే కూడా సౌకర్యాలు విస్తృతం చేసింది. సేవలు సులభతరం చేసింది. అందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టికెట్‌ సులభంగా బుక్‌ చేసుకోవాలన్నా.. స్టేషన్‌లో రైలు దిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలన్నా..డివిజన్‌లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది. రైల్వే ప్రయాణికులకు ఈ సమాచారం.
- గుంతకల్లు
    
సాధారణంగా రిజర్వేషన్‌ టిక్కెట్‌ కొన్న (టిక్కెట్‌ కన్ఫార్మ్‌డ్‌) ప్రయాణికులకు మాత్రమే రైల్వే గదుల కేటాయింపు ఉంటుంది. గదులను ‘‘గిగిగి.ఐఖఇఖీఇ.ఇౖM’’ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు రైలు ఎక్కేస్టేషన్, రైలు దిగే స్టేషన్ల ఆధారంగా రైల్వే గదుల బుకింగ్‌ సదుపాయం ఉంటుంది. గదుల్లో ఏసీ, నాన్‌ ఏసీ, సింగిల్, డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఉంటాయి. డివిజన్‌లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యం ఉంది.

గుంతకల్లు రైల్వే జంక‌్షన్‌లోని రైల్వే గదుల ధరల వివరాలు :
    రైల్వే జంక‌్షన్‌లో మొత్తం 10 గదులు ఉన్నాయి. వీటిలో ఒకటి ఏసీ గది. మిగిలినవి డబుల్‌ బెడ్‌రూమ్, సింగిల్‌ బెడ్‌ గదులు. ఏసీ గది రోజుకు (ఉదయం 6.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు) రూ.600, డబుల్‌కాట్‌ బెడ్‌రూం రోజుకు రూ.300, సింగిల్‌ కాట్‌ బెడ్‌రూం రూ.100 అద్దె వసూలు చేస్తారు.

– డివిజన్‌ పరిధిలోని తిరుపతి, రేణిగుంట జంక‌్షన్‌లో ఏసీ డీలక్స్, నాన్‌ ఏసీ డబుల్, సింగిల్, డార్మెంటరీ హాల్‌ ఉన్నాయి. ఏసీ గదికి రూ.600, డబుల్‌కాట్‌ బెడ్‌రూంకు రూ.450, సింగిల్‌కాట్‌ బెడ్‌రూం రూ.90, డార్మెంటరీ హాల్‌కు రూ.175 అద్దె వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement