రెండు మోటార్ సైకిళ్లు ఢీ
పాలకొల్లు టౌన్: పట్టణంలోని ఎర్ర వంతెన వద్ద ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా, ఒక యువకుడు పరిస్థితి విషమంగా మారింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మార్టేరు నుంచి పాలకొల్లు వైపు మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తి అదే మార్గంలో మార్టేరు వైపు మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పీచు శ్రీను(పోడూరు మండలం, వేడంగిపాలెం) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో మోటార్ సైకిల్‌పై వెళుతున్న గోగులమండ శేఖర్ (పోడూరు మండలం, పెనుమదం), వింజుమూరి మహేష్ (పోడూరు మండలం, వేడంగిపాలెం) తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరూ తాపీ పని చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును పట్టణ సీఐ బి.కృష్ణకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.