మరమ్మతు మరిచారు
Published Thu, Aug 11 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
అసంపూర్తిగా ఖమ్మం దర్వాజ పనులు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్
పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు
పర్యాటక అభివృద్ధికి నోచుకోని నిజాం కోట కట్టడాలు
మరమ్మతుకు రూ.33 లక్షలు
జఫర్‌గఢ్ : నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేం పట్టింది లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి ప్రాచుర్యం పొందిన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నా యి. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో నిజాం నవాబులు తమ హయాంలో వివిధ చారిత్రక కట్టడాలు చేపట్టా రు.
ఇందులో భాగంగా జాఫర్‌దౌలత్ నవాబు పన్నుల వసూలుతోపాటు శత్రువుల బారి నుంచి ర„ý ణ పొందేందు కు జఫర్‌గఢ్ ప్రధాన రహదారి వెంబడి ఖమ్మం, హన్మకొం డ, పట్నం(హైదరాబాద్) దర్వా జలను నిర్మించారు. అయి తే ఇందులో హన్మకొండ, పట్నం దర్వాజలు కాలగర్భంలో కలిసిపోగా.. ఖమ్మం దర్వాజ కొంచెం వెలుగులో ఉంది. శిథిలావస్థకు చేరి కళావిహీనంగా మారిన ఖమ్మం దర్వాజ కట్టడాలను పునరుద్ధరించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పురావాస్తు శాఖ నుంచి రూ. 33 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు దర్వాజ మరమ్మతు పనులకు అధికారులు టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. అయితే ప్రారంభంలో పనులు వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్ మధ్యలో ఆపివేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
పత్తాలేని సీసీ రోడ్డు పనులు
ఖమ్మం దర్వాజ మరమ్మతు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఎడమవైపున మాత్రమే మరమ్మతు చేపట్టారు. కోట కుడివైపున ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదు. అలాగే కోట లోపలి భాగంలో ఉన్న పెద్ద బండరాళ్లు, మట్టిని తొలగించలేదు. కోట ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణం ఇంతవరకు చేపట్టకపోవడంతో పర్యాటకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పనులు నిలిచిపోయి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హరితహారంలో భాగంగా ఖమ్మం దర్వాజ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న దర్వాజ మరమ్మతు పనుల విషయాన్ని స్థానికులు ఆయనకు వివరించారు. ఖమ్మం దర్వాజ మరమ్మతు పనులతోపాటు మండలంలోని చారిత్రక కట్టడాలకు వెలుగులు తీసుకురావాలని వారు ఎమ్మెల్యే, అధికారులను కోరారు.
Advertisement