ప్రసంగిస్తున్న కాత్యాయినీ
యూనివర్సిటీక్యాంపస్: ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయిని పేర్కొన్నారు. ఎస్వీయూలోని తెలుగు అధ్యయనశాఖలో శనివారం జరిగిన ధర్మనిధి ఉపన్యాసంలో ఆమె ప్రసంగించారు. ‘ప్రాచీన సాహిత్యం – స్త్రీ వాద దృక్పథం’ అనే అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలుగు సాహిత్యంలో పురుషకవులే గుర్తింపు పొందారని చెప్పారు. కొంతమంది మాత్రమే స్త్రీ రచయితలు గుర్తింపు పొందారన్నారు. సాహిత్యంలో స్త్రీల సంఖ్య పెరగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో వీసీ దామోదరం, తెలుగువిభాగాధిపతి మునిరత్నమ్మ, అధ్యాపకులు జె. మునిరత్నం,పేటాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.