పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై సమీక్ష
Published Fri, Jun 9 2017 7:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
పోలవరం : పోలవరం ప్రాజెక్టు కట్టడాల డిజైన్లపై డామ్ డిజైన్స్ రివ్యూ పానల్(డీడీఆర్‌పీ) కమిటీ శక్రవారం పోలవరం ప్రాజెక్టు ఏజెన్సీ కార్యాలయంలో సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తొలుత కమిటీ వారు స్పిల్‌వే, ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్‌డ్యామ్, పవర్‌హౌస్, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపర్ డ్యామ్ డిజైన్‌కు సంబంధించి ప్రధానంగా చర్చించామన్నారు. కాపర్‌డ్యామ్ నిర్మాణంలో ఎగువన ఎంత ఎత్తు పెట్టాలి, దిగువన ఎంత ఎత్తు పెట్టాలి అనే అంశాలతో పాటు ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ట్రీట్‌మెంట్‌పై కమిటీ చర్చించినట్టు చెప్పారు. కమిటీ సభ్యులు వైకే హాండా, దినేష్ భార్గవ్, ప్రతినిధులు ఎన్.శివకుమార్, అస్తన్ అబ్దుల్లా, ఆర్‌కే గుప్తా, ఖయ్యం అహ్మద్, ముఖేష్‌కుమార్, అనిల్‌జైన్, ఆర్.చిత్ర, ఎస్ సత్యనారాయణ, పీఎస్ కుంజరే, నీనా ఐజిన్, ఎ.పరమేశ్వరన్, ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు పాల్గొన్నారు.
Advertisement