ఖండవల్లిలో భారీ చోరీ
ఖండవల్లి(పెరవలి): తల్లి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉండగా కార్యక్రమం కోసం తీసుకోచ్చిన సొమ్ము ఇంట్లో పెడితే దానిని దొంగలు అపహరించుకోవటంతో ఆకుటుంభం కన్నీరు మున్నీరుగా విలపించారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో పేరూరి సత్యనారాయణ ఇంట్లో సోమవారం రాత్రి జరిగిన చోరీలో 30కాసులు బంగారం రూ.25 వేలు నగదు అపహరణకు గురైయ్యింది. కన్నతల్లి రుణం తీర్చుకోవటం కోసం కార్యక్రమానికి తీసుకు వచ్చిన నగదు దొంగలు పట్టుకుపోవటంతో ఏమ చెయ్యాలో తెలియక కన్నీటి పర్యంతం అయ్యారు. వారం రోజుల క్రితం కన్నతల్లి కానిరాని లోకాలకు వెళ్ళిపోవటంతో ఇల్లంతా చుట్టాలతో ఉన్నారు. తల్లి ఇంట్లో చనిపోవటంతో ఇంట్లో ఉండకూదన్నారని ప్రక్కనే ఉన్న ఇంట్లో నివశిస్తున్నారు. సోమవారం అప్పుచేసి తెచ్చిన సొమ్ము ఇంట్లో బీరువాలో పెట్టి ప్రక్కనే ఉన్న ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంట్లోకి వెళ్ళేసరికి బీరువా తలుపులు తెరిచి వస్తువులు చిందర వందరగా పడిఉండటంతో దొంగతనం జరిగిందని ఊహించి వెంటనే స్దానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పెరవలి ఎస్‌ఐ పి నాగరాజు తన బందంతో హుటాహుటిన సంఘటనా స్దలానికి చేరుకుని విచారణ చేసారు. దొంగతనంలో రూ.25వేల నగదు, 30 కాసుల బంగారం పోయిందని సత్యనారాయణ లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయటంతో కేసును నమోదు చేసారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే ఈ ఇంటి ఆనుపాను తెలిసిన వారే చేసారని అనుకుంటున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో నగదు పెట్టి రాత్రి 11 గంటలకు ప్రక్కనే ఉన్న ఇంట్లో నిద్రకు ఉపకరించామని దీనితో ఆతరువాత దొంగతనం జరిగి ఉంటుందని తెలిపారు. దొంగలు ఎటువంటి చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించటానికి కిటికీ నుండి ఊచతో తలుపులు గొనెం తీసారని దీనితో ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బీరువా బద్దలు కొట్టి అందులో ఉండే నగదు, నగలు పట్టుకుని వెళ్ళారు. పెరవలి పోలీసులు రంగ ప్రవేశం చేసాక, ఎవ్వరీనీ గదిలోకి రాకుండా నిలుపుదల చేసి ఏలూరు నుండి వచ్చిన ప్రత్యేక క్లూస్ టీమ్ వేలిముద్రలు చేకరించారు. తణుకు సిఐ చింతా రాంబాబు సంఘటన స్దలానికి వచ్చి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.