వాలీబాల్ ఫైనల్‌కు చేరుకున్న ఆర్టీపీపీ
Published Sat, Dec 10 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
ఎర్రగుంట్ల: ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆర్టీపీపీ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం వైజాగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి తమ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించిందని స్పోర్ట్సు సెక్రటరీ ఖాదర్‌బాషా తెలిపారు. ఈ టోర్నమెంట్ వైజాగ్‌లో ఈ నెల 7వ తేది నుంచి 11 వరకు జరగనున్నాయి. వైజాగ్‌లో ఆదివారం జరిగే ఫైనల్‌మ్యాచ్లో వీటీపీఎస్ జట్టుతో ఆర్టీపీపీ తలపడనుంది. ఈ జట్టులో రాంప్రసాద్, రామక్రిష్ణ, మణిపాల్, ఏసురత్నం, రవి ఉన్నారు.
Advertisement
Advertisement