గాయత్రి మంత్ర జప దీక్షాధారణ | Sandhya vandana training | Sakshi
Sakshi News home page

గాయత్రి మంత్ర జప దీక్షాధారణ

Published Mon, Aug 1 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

గాయత్రి మంత్ర జప దీక్షాధారణ

గాయత్రి మంత్ర జప దీక్షాధారణ

 
గుంటూరు ఈస్ట్‌ : పండరీపురం 5వ లైనులోని యాజ్ఞవల్క్య క్షేత్రంలో ఆదివారం సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ఆధ్వర్యంలో ద్వికోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్మయానంద భారతీ స్వామి 250 మందికి జప దీక్ష ఇచ్చారు. మంత్రం స్వీకరించిన వారు సామూహిక జపం చేశారు. నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయానంద భారతీ స్వామి ప్రసంగిస్తూ దీక్షా ధారణ చేసిన వారు 120 రోజుల పాటు ఒక సహస్ర గాయత్రి జపం చొప్పున లక్ష గాయత్రి జపం చేసిన అనంతరం సామూహిక గాయత్రి హోమాలు నిర్వహిస్తామన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉపనీతులైన బ్రాహ్మణులందరి చేత సంధ్యావందనం చేయించాలనే లక్ష్యంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ముద్రాసహితంగా గురుముఖత సం ధ్యానవందనం నేర్పిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం  జపాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement