- జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, «ధర్నా
- జేసీకి వినతిపత్రం అందజేత
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Published Fri, Sep 23 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
హన్మకొండ అర్బన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేనేత జేఏసీ «ఆధ్వర్యంలో గురువారం ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్బంగా జేఏసీ అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేనేతను పరిశ్రమల శాఖలో కలపొద్దని కోరారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా చేనేత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని, చేనేత కార్పొరేషన్‌ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, నేత కార్మికుల ఆత్మహత్యలు నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. పలువురు మహిళలు రాట్నాలతో కలెక్టరేట్ వద్దే వస్త్రాలు నేసి నిరసన తెలిపారు. అనంతరం జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు వన్నాల శ్రీరాములు, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్‌రావు, ఈవీ శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, బత్తిని శ్రీనివాస్‌రావు, మోడెం శ్రీధర్, సత్యనారాయణ, రజినీకాంత్, శ్యాం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement