జిల్లా ఏర్పాటు పనులు వేగవంతం | speedup the peddaplly distritce | Sakshi
Sakshi News home page

జిల్లా ఏర్పాటు పనులు వేగవంతం

Published Tue, Sep 6 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

జిల్లా ఏర్పాటు పనులు వేగవంతం

జిల్లా ఏర్పాటు పనులు వేగవంతం

  • నేడు కలెక్టరేట్‌ పరిశీలనకు కలెక్టర్‌ రాక
  • పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపనులు వేగవంతమయ్యాయి. కలెక్టరేట్‌ కార్యాలయంకోసం స్థానిక ఐటీఐ బిల్డింగ్‌ను ఇక్కడి అధికారులు ప్రతిపాదించారు. మంగళవారం స్థానిక జూనియర్‌ కాలే జీ బిల్డింగ్‌లను పరిశీలించారు. బుధవారం కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయాలను గుర్తించేందుకు రానున్నారు. విభజనకు సంబంధించిన అన్నిపనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సిరిసిల్లను జిల్లా చేయాలని పెద్దఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపై పునరాలోచిస్తోందని సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం ప్రజలను కొంత అయోమయానికి గురిచేసింది. అయితే అలాంటిదేమీ లేదని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో స్పష్టమవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యులకు జిల్లా కావద్దని ఉందంటూ ప్రచారం జరిగింది. దీనికి అధికార పార్టీ నాయకుల గ్రూపు తగాదాలు కూడా తోడయ్యాయి. ఇప్పటికే పెద్దపల్లిలో పార్టీలో మూడుగ్రూపులు కొనసాగుతుండగా.. కొత్తగా జిల్లా ఏర్పడితే గ్రూపు రాజకీయాలు ఇబ్బందికరంగా మారుతాయని, దీంతో పెద్దపల్లి జిల్లాను చేసేందుకు అధిష్టానం సైతం ఇష్టపడటం లేదని ప్రచారం జరిగింది. ఇటీవల హన్మకొండకు బదులు వరంగల్‌ రూరల్‌ జిల్లాను ప్రకటించడం, పెద్దపల్లి ఊసెత్తకపోవడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై పునఃపరిశీలన జరుగుతున్నది వాస్తవమేగానీ పెద్దపల్లి జిల్లాపై అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.
    ఎస్సారెస్పీ క్యాంపు ఆధునీకరణ
    కలెక్టరేట్‌ కార్యాలయాల నిర్వహణ కోసం ఎస్సారెస్సీ క్యాంపు బిల్డింగ్‌ల ఆధునీకరణకు అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. బిల్డింగ్‌ టీవోపీ, సీలింగ్, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ సంబంధించి అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 
     
     
     

Advertisement
Advertisement