క్రీడలతో ప్రత్యేక గుర్తింపు
Published Sun, Feb 19 2017 8:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
కడప స్పోర్ట్స్ : క్రీడలు ఆడటం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తోందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ఆయన సూచించారు. అంతకు మునుపు బాలుర విభాగంలో ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు మెడల్స్, నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు ఉమాశంకర్, గౌస్‌బాషా, ఎస్‌ఎండీ షఫీ, అమృత్‌రాజ్, అబ్దుల్ మునాఫ్, తమీమ్ అల్తాఫ్, ఖాదర్‌మోహిద్దీన్‌ఖాన్, శ్రీనివాసరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు నిత్యప్రభాకర్, రామాంజినేయులు, పవన్, క్రీడాకారులు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్ విజేతలు : వేంపల్లి (ప్రథమ), ఓబులవారిపల్లి (ద్వితీయ), యర్రగుంట్ల (తృతీయ).
ఫుట్‌బాల్ విజేతలు : కడప (ప్రథమ), యర్రగుంట్ల (ద్వితీయ), కమలాపురం (తృతీయ).
Advertisement