గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
Published Thu, Oct 20 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
కోవూరు: గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే క్రీడాకారుడి గొప్ప లక్షణమని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి టీ లవకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హో ప్రాంగణంలో బుధవారం కబడ్డీ క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బాల,బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులు పోటీల్లో సత్తాచాటాలని కోరారు. అనంతరం కోవూరు సబ్ రిజిస్ట్రార్ ఎన్ నాగేశ్వరరావు, ఎస్‌ఐ వెంకట్రావు మాట్లాడారు. యువతో విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అశోక్‌కుమార్, కోవూరు ఉపసర్పంచ్ ఇంతా మల్లారెడ్డి, సీనియర్ క్రీడాకారులు పూండ్ల జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.
జట్లు వివరాలు.
బాలుర జట్టు : షేక్ ఫిరోజ్ ,కెప్టెన్ (లేగుంటపాడు), ఏ కళ్యాణ్, వీ సాయి (లేగుంటపాడు) ఏ కరుణాకర్ (చెర్లోపాళెం), వీ జనార్దన్ (కావలి), ఉదయ్ (కోవూరు) , ఐ కళ్యాణ్ (సోమరాజుపల్లె), కే రాజకుమార్ (కావలి), క్రాంతి (దువ్వూరు), సీహెచ్ ప్రదీప్(ముదివర్తి) సాయి (ముదివర్తి), శివకృష్ణ (కావలి).
బాలికల జట్టు :
షేక్ తహసీన్ (కెప్టెన్) (నెల్లూరు), ఈ.ఇందు (తడ), ఆర్.చెంగమ్మ( తడ), ఓ.వసుధ (ముదివర్తి) , ఎన్.మౌనిక(తడ), కే పద్మ (కావలి), డీమహిత (కోవూరు), జీ నిర్మల (వావిళ్ల), పీ సుకన్య (సీఎస్‌పురం), బీ రాజ్యలక్ష్మి (కోవూరు), కే జాగృతి(కోవూరు).
Advertisement
Advertisement