'యాగశాలలో మంటలు శుభసూచకం' | swami swarupananda sarawati comments on fire accident in yaga shala | Sakshi
Sakshi News home page

'యాగశాలలో మంటలు శుభసూచకం'

Published Sun, Dec 27 2015 2:24 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

'యాగశాలలో మంటలు శుభసూచకం' - Sakshi

'యాగశాలలో మంటలు శుభసూచకం'

ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పూర్ణాహుతి అయిన వెంటనే స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం మంచిదే అని శారద పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి తెలిపారు. అగ్ని ప్రమాదం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోనే ఎవరూ చేయలేని రీతిలో కేసీఆర్ యాగం నిర్వహించారన్నారు.

అయుత చండీయాగం అద్భుతంగా జరిగిందన్న ఆయన యాగశాలలో మంటలు శుభసూచకంగా తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పింది.

 

సర్వసంపూర్ణంగా యాగం సఫలం

భారతీతీర్థ, శంకరాచార్య పర్యవేక్షణలో యాగం సుసంపన్నమైంది. అభిజిత్‌ లగ్నంలో పూర్ణాహుతి జరగాల్సి ఉంది.. కానీ..ముందుగానే శాస్త్రోక్తంగా జరిగిపోయింది. నిర్వాహకులు కేసీఆర్‌ యాగవిభూతి ధరించారు. - అవధాని మాడుగుల నాగఫణీంద్ర శర్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement