లేపాక్షి ఆలయంలో అనుపమ సజ్జనార్
లేపాక్షి ఆలయంలో అనుపమ సజ్జనార్
Published Thu, Jul 21 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
లేపాక్షి : తెలంగాణ రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్ సజ్జనార్ సతీమణి అనుపమసజ్జనార్ బుధవారం ఉదయం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శిలాశాసనాలు, ఆలయ కట్టడాలు, వివిధ శిల్పాలను ఆమె తిలకించారు. అదేవిధంగా ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడి విగ్రహం, నాట్యమండపంలోని శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన దేవతలు, వివిధ రకాలకు చెందిన లేపాక్షి కళాకృతులు తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నందివిగ్రహం చూసి ఆనందించారు. హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్‌ఐ శ్రీధర్, ఏఎస్‌ఐ కళావతి ఆమె వెంట ఉన్నారు. కాగా గతంలో లేపాక్షి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు ఐజీ సజ్జనార్ చేసిన కృషి అభినందనీయమని గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు, అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Advertisement