పెళ్లింట విషాదం
వీరపునాయునిపల్లె: అంకిరెడ్డిపల్లెలో బాలగంగిరెడ్డి, అంకాల్‌రెడ్డి అన్నదమ్ములు ఉన్నారు. బాలగంగిరెడ్డి కుమార్తె వివాహాన్ని బుధవారం చేయాలని నిర్ణయించారు. అంకాల్‌రెడ్డి కుమారుడు శివకృష్ణారెడ్డి(28) తన చెల్లెలి వివాహాన్ని వైభవంగా చేయాలని పనుల్లో నిమగ్నమయ్యాడు. నీళ్లను ట్యాంకర్‌లో తీసుకొచ్చేందుకు పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడ ట్యాంకర్ పైకి ఎక్కి నీరు పడుతుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అతనిని కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.
ఆగిన పెళ్లి:కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం వివాహం ఆగిపోయింది.