- యువతపైనే దేశ భవిష్యత్
- బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి
ఓటు బ్యాంకు రాజకీయాలకే టీఆర్‌ఎస్ ప్రాధాన్యం
Published Sat, Sep 10 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
రేగొండ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని కాకతీయ పాఠశాల ఆవరణలో శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిం దన్నారు. నాటి నిజాం రాజులు తెలంగాణ ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని.. అలాంటి వారి పాలనను కేసీఆర్ కీర్తించడం ఆయన ఆవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రం వస్తే సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. బంగారు తెలంగాణగా మార్చడంలో దేవుడెరుగుగాని కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారుతోందని ఎద్దేవా చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రజలకు పిలునిచ్చారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జేఎ¯Œæఎస్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కాసర్ల రాంరెడ్డి, రాష్ట్ర పరిశీలకులు శాంతికుమార్, జిల్లా కోశాధికారి చందుపట్ల కీర్తిరెడ్డి, సత్యపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు వెన్నంపల్లి పద్మ, పాపయ్య, సర్పంచ్ ఆజ్మీరా సంధ్య, చదువు రాంచంద్రారెడ్డి, తూమల శేఖర్, బట్టు రవి, రాజు, మల్లేష్ పాల్గొన్నారు.
Advertisement