సివిల్‌ సప్లై గోడౌన్‌ తనిఖీ చేసిన విజిలెన్స్‌ అధికారులు | Vigilance officials of the civil supplies godown inspection | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లై గోడౌన్‌ తనిఖీ చేసిన విజిలెన్స్‌ అధికారులు

Published Tue, Aug 23 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

నేలకొండపల్లి గోడౌన్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నేలకొండపల్లి గోడౌన్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నేలకొండపల్లి : మండల కేంద్రంలోని సివిల్‌సప్లై మండల లెవల్‌స్టాక్‌ పాయింట్‌ను సోమవారం విజిలెన్స్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లోని రికార్డులు, స్టాకును పరిశీలించారు. ఇటీవల నేలకొండపల్లిలో పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని వేలంలో దక్కించుకున్న ఓ వ్యాపారి ఒకే అనుమతితో రెండు వే బిల్లులు తయారు చేసి రెండు లారీల బియ్యం తరలిస్తుండగా తల్లాడ వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నేలకొండపల్లి సివిల్‌ సప్లై గోడౌన్‌లో అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ సీఐ వెంకటేష్, డీటీలు సునీల్‌రెడ్డి, రాజేందర్‌కుమార్, ఆర్‌ఐలు మహేష్, రామచంద్రు, నేలకొండపల్లి సవిల్‌సప్లై గోడౌన్‌ ఇన్‌చార్జ్‌ బండి బాలజీ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

పోల్

Advertisement