వైఎస్‌ హయాంలోనే పేదల సంక్షేమం | WelFare Scheams in YS Hayam | Sakshi
Sakshi News home page

వైఎస్‌ హయాంలోనే పేదల సంక్షేమం

Published Sun, Jul 24 2016 9:25 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

అడ్డాకుల: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలయ్యాయని ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అడ్డాకుల మండలంలోని మూసాపేట ఐబీఅతిథి గహంలో కాంగ్రెస్‌ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల వద్ద తట్ట మన్ను కూడా వేయకున్నా టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం విస్తత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుని రైతుల నోట్లో మట్టికొట్టిందని ఆరోపించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, డీసీసీ ఉపాధ్యక్షుడు పి.విశ్వేశ్వర్, అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement