అనంతపురం రూరల్: మహిళా రైతుల హక్కులను ప్రభుత్వాలు పటిష్టం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని ఎకాలజీ కేంద్రంలో వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర, వారి హక్కులపై మహిళ కిసాస్ అధికార్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలతో కుటుంబ భారం మొత్తం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి రైతు భార్యపై పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రభుత్వాలు చేయూతను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రుణభారం పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. భర్త మరణించిన తర్వాత అతనికి చెందిన భూమి మా పేరిట లేక రుణమాఫీ కావడంలేదని పలువురు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి మహిళా రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీఏ శ్రీరామమూర్తి, నాబార్డ్ ఏజీఎం రవీంద్ర, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజాతోపాటు పలువురు పాల్గొన్నారు.
మహిళా రైతుల హక్కులను పటిష్టం చేయాలి
Published Thu, Aug 4 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement