పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలి
-
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
వెంకటగిరి: పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఆలయ ఈఓ రామచంద్రరావు, సీఐ శ్రీనివాసరావును ఆరా తీశారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగ తరహాలో వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. క్యూలైన్లలో మార్పులు చేయాలన్నారు. వీఐపీలు, రూ.250 టికెట్ భక్తులు ఎదురు వరుసలో రావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అన్ని క్యూలు ఆంజనేయస్వామి ఆల యం వీధి నుంచే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అనంతరం పోలేరమ్మ పుట్టిల్లు అయి న కుమ్మరి ఇంటిని పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చిట్టేటి హరికృష్ణ, నక్కా వెంకటేశ్వరరావు, జి.ఢిల్లీబాబు, గిరిరెడ్డి, చిరంజీవి, బి.రత్నాకర్‌రెడ్డి, కౌన్సిలర్ గౌస్‌బాషా తదితరులు ఉన్నారు.