బీయూఎంఎస్‌తో డాక్టర్ హోదా | BUMS WITH Doctor status | Sakshi
Sakshi News home page

బీయూఎంఎస్‌తో డాక్టర్ హోదా

Published Wed, Jul 23 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

బీయూఎంఎస్‌తో డాక్టర్ హోదా

బీయూఎంఎస్‌తో డాక్టర్ హోదా

 భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైద్య విధానాల్లో యునానీ ఒకటి.. 12వ శతాబ్దంలో దేశంలోకి ప్రవేశించిన యునానీ విధానం ఇప్పటికీ ప్రజల ఆదరణ పొందుతోంది.. అంతేకాకుండా హోమియోపతి, ఆయుర్వేదంతో సమానంగా డాక్టర్ హోదా దక్కే అవకాశం ఉండడంతో యునానీ కోర్సును ఎంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.. ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ 2014-15 విద్యా సంవత్సరానికి బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 బీయూఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు:
     గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్-హైదరాబాద్
     సీట్ల సంఖ్య: 60
     డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్-కర్నూలు
     సీట్ల సంఖ్య: 50
     కోర్సు వ్యవధి:
     ఐదున్నరేళ్లు (12 నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి)
     పవేశం: రాత పరీక్ష ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడు సబ్జెక్ట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. పరీక్షను ఇంగ్లిష్/ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
 
 అర్హత: 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్/ తత్సమానం. ఉర్దూ/ అరబిక్/ పర్షియన్ భాషలతో పదో తరగతిలో ఉత్తీర్ణుడై ఉండాలి లేదా యూనివర్సిటీ/ ప్రభుత్వం నియమించే బోర్డు నిర్వహించిన ఉర్దూ పరీక్షలో అర్హత సాధించాలి లేదా నిర్దేశించిన అర్హత.
     వయసు: డిసెంబర్ 31, 2014 నాటికి 17 ఏళ్లు.
     దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును ఆగస్ట్ 7వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
     దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 8, 2014.
     రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 24, 2014.

     పరీక్ష కేంద్రం:
     ఉస్మానియా మెడికల్ కాలేజ్- హైదరాబాద్.
     హాల్‌టికెట్లను గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్- హైదరాబాద్ నుంచి ఆగస్ట్ 21, 22 తేదీల్లో పొందొచ్చు.
        దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:
     {పిన్సిపల్,
     గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్,
     చార్మినార్ దగ్గర,
     హైదరాబాద్-500 002.
 వివరాలకు: http://ntruhs.ap.nic.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement