NTR University of Health
-
మెడికల్ కౌన్సెలింగ్ విధి విధానాలు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు సంబంధిత ధ్రువపత్రాలన్నీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఏ ఒక్కటి లేకున్నా కౌన్సెలింగ్‌లో అనర్హతకు గురయ్యే ఆస్కారం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు ఎంసెట్ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం లభించిందని సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో మంచి వైద్యునిగా గుర్తింపు పొందడం లక్ష్యంగా చేసుకోవాలి. దీని కోసం కళాశాలలలో చేరిన మొదటి రోజు నుంచే శ్రమించాలి. -డాక్టర్ టి. రవి రాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కౌన్సెలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఆన్లైన్ పద్ధతిలో ఐదు కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్రాల వివరాలు.. జేఎన్టీయూ- హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీ-వరంగల్ ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం ఎస్వీ యూనివర్సిటీ -తిరుపతి. విద్యార్థులు ఈ ఐదు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. కొత్తగా: ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 120 జీవో మేరకు 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కిందకు వస్తాయి. మిగతా 127 సీట్లకు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు (ఆంధ్రప్రదేశ్) కేటాయించారు. మరో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేస్తారు. అర్హత-వయసు: మెడికల్/డెంటల్ కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ ర్యాంక్‌తోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్దేశించిన కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. ఓపెన్ కేటగిరీ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణత (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 40 శాతం; ఓసీ వికలాంగ విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించాలి)ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం (80 మార్కులు); బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం (64 మార్కులు); ఓసీ పీహెచ్ అభ్యర్థులు 45 శాతం (72 మార్కులు) పొంది ఉండాలి. వ యసు: 31-12-2014 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 02-01-1998 తర్వాత జన్మించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులు. కావల్సిన సర్టిఫికెట్లు: ఎంసెట్ హాల్‌టికెట్ ఎంసెట్ ర్యాంకు కార్డు జనన ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన సర్టిఫికెట్) ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల జాబితా టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్ స్పెషల్ కేటగిరీ కింద హాజరయ్యే విద్యార్థులకు నిర్దేశించిన సర్టిఫికెట్లు రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్), ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఎంఆర్ఓ/ తహసీల్దార్ 1-1-2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్. కౌన్సెలింగ్ ఫీజులు: కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు అటెస్ట్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు యూనివర్సిటీ, ట్యూషన్ ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన బ్యాంక్ కౌంటర్లలో చెల్లించాలి. గతంలో మాదిరిగానే: గతంలో మాదిరిగానే ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ల వారీగా కౌన్సెలింగ్ జరుగుతుంది. స్థానికతను నిర్ణయించడానికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (అర్హత పరీక్ష) వరకు విద్యార్ధి చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్లు (ఆరు నుంచి ఇంటర్ వరకు)ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్/డెంటల్ కళాశాలకు స్థానిక అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివి ఉంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. మొదట అన్ రిజర్వ్డ్: కౌన్సెలింగ్‌లో మొదట అన్‌రిజర్వుడ్ కేటగిరీ కింద 15 శాతం ీసీట్లను భర్తీ చేస్తారు. తర్వాత 85 శాతం లోకల్ సీట్లలో ప్రవేశ ప్రకియను చేపడతారు. తొలుత భర్తీ చేసే 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం... విద్యార్థులు తమ రీజియన్‌తో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలలోని కళాశాలల్లో సీట్ల కోసం పోటీ పడొచ్చు. సీట్లను భర్తీ చేసే క్రమంలో రిజర్వేషన్, స్థానికతతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో చూస్తారు. తర్వాత యూనివర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్‌లోకల్ వీటిని వరుసగా పరిగణనలోకి తీసుకుని సీటును కేటాయిస్తారు. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం: రెండు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. జీవో నం. 165: ప్రభుత్వం 2010, జూలై 20వ తేదీన విడుదల చేసిన జీవో నం.165 ప్రకారం మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు పొంది న అభ్యర్థులు కోర్సు పూర్తయిన వెంటనే సంవత్సర కాలం పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పని చేయాలి. ఫీజులు: ఎంబీబీఎస్: వర్సిటీ ఫీజు రూ. ట్యూషన్ ఫీజు రూ. ప్రభుత్వ కళాశాల 7,000 10,000 ప్రైవేట్-ఎ: 11,500 60,000 ప్రైవేట్-బి: 20,500 2,40,000 బీడీఎస్: ప్రభుత్వ కళాశాల 6,000 9,000 ప్రైవేట్-ఎ: 10,500 45,000 ప్రైవేట్-బి: 14,500 1,30,000 ఆర్మీ డెంటల్: 14,500 1,35,000 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in -రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ. మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతుంది. షెడ్యూల్ వివరాలు.. ఆగస్టు 30, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1-800 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 801-1500 ర్యాంకు వరకు ఆగస్టు 31, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1501-3000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 3001-4500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 1, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 4501-6500 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 6501-8500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 2, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1-2000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 2001-3000 ర్యాంకు వరకు సెప్టెంబర్ 3, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 3001-4500 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 4501-6500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 4, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 6501-8000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 8001-10000 ర్యాంకు వరకు సెప్టెంబర్ 5, 2014 ఎస్సీ కేటగిరీ వారికి ఉదయం 9 గం. 10001-15000 ర్యాంకు వరకు ఏయూ పరిధిలోని బీసీ-ఈ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 10001-20000 ర్యాంకు వరకు ఎస్వీయూ, ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 10001-20000 ర్యాంకు వరకుఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 20001-25000 ర్యాంకు వరకు ఎన్సీసీ, ఆర్మీ, క్రీడాకారులు, వికలాంగులు, పోలీస్ మిలటరీ చిల్డ్రన్ కేటగిరీ విద్యార్థులకు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
కేజీహెచ్‌ను సందర్శించిన మంత్రి
విశాఖపట్నం, మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం కేజీహెచ్, ఆంధ్ర వైద్యకళాశాలను సందర్శించారు. ఆస్పత్రిలోని ప్రవేశిస్తుండగా ప్రధాన ద్వారం వద్ద ధర్నాచేస్తున్న ట్రామాకేర్ సిబ్బంది మంత్రికారును అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్డియాలజీ ఐసీయూను సందర్శించి సేవలను తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స విభాగంతో పాటు ప్రసూతి వైద్య విభాగాలను సందర్శించారు. అక్కడ ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైద్య కళాశాలకు చేరుకొని అక్క డ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు, జిల్లా నోడల్ వైద్యాధికారి ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ ముద్దాడ రవి చంద్రలతో సమావేశమయ్యారు. 50 మెడికల్ సీట్లు పెరిగే నేపథ్యంలో ఎంసీ ఐ అడిగిన సదుపాయాలను కల్పించే విషయంలో చేపట్టవలసిన చర్యల గు రించి చర్చించారు. దీర్ఘకాలిక సెలవుపెట్టి బయట ఆస్పత్రులకు వెళ్తున్న వైద్యులపై కఠిన చర్యలు చేపడతామ ని, వారి వివరాలు వెంటనే అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పదోన్నతులకు నోచుకోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు డీపీసీని నిర్వహిం చాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ద్వా రా వినతిపత్రం అందజేయగా మంత్రి స్పంధిస్తూ పదోన్నతులు ఇస్తే బయటికి వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు. తాము సిద్దంగా ఉన్నామని అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్పారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ మదుసూదనబాబు, ఆర్‌ఎంఓలు శాస్త్రి, బంగారయ్య పాల్గొన్నారు. మానవీయకోణంలో వైద్యసేవలందించాలి మానవీయ కోణంలో వైద్య సేవలు అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్యులను కోరారు. సోమవారం సాయంత్రం కేజీహెచ్ రేడియాలజీ లెక్చర్ గ్యాలరీలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ విధుల్లో ఉంటూ నిజాయతీతో సమయపాలన పాటించాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు సేకరించి కేజీహెచ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నామన్నారు. పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ రూ.2 కోట్లు అందించేందుకు ముందుకువచ్చిందన్నారు. మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడుతోపాటు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్.. జీవీఎంసీ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడారు. తొలుత సమీకృత విరోచన వ్యాధి నివారణ పక్షోత్సవాలను మంత్రులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
బీయూఎంఎస్‌తో డాక్టర్ హోదా
భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైద్య విధానాల్లో యునానీ ఒకటి.. 12వ శతాబ్దంలో దేశంలోకి ప్రవేశించిన యునానీ విధానం ఇప్పటికీ ప్రజల ఆదరణ పొందుతోంది.. అంతేకాకుండా హోమియోపతి, ఆయుర్వేదంతో సమానంగా డాక్టర్ హోదా దక్కే అవకాశం ఉండడంతో యునానీ కోర్సును ఎంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.. ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ 2014-15 విద్యా సంవత్సరానికి బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. బీయూఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు: గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్-హైదరాబాద్ సీట్ల సంఖ్య: 60 డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కాలేజ్-కర్నూలు సీట్ల సంఖ్య: 50 కోర్సు వ్యవధి: ఐదున్నరేళ్లు (12 నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి) పవేశం: రాత పరీక్ష ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడు సబ్జెక్ట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. పరీక్షను ఇంగ్లిష్/ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్లతో ఇంటర్మీడియెట్/ తత్సమానం. ఉర్దూ/ అరబిక్/ పర్షియన్ భాషలతో పదో తరగతిలో ఉత్తీర్ణుడై ఉండాలి లేదా యూనివర్సిటీ/ ప్రభుత్వం నియమించే బోర్డు నిర్వహించిన ఉర్దూ పరీక్షలో అర్హత సాధించాలి లేదా నిర్దేశించిన అర్హత. వయసు: డిసెంబర్ 31, 2014 నాటికి 17 ఏళ్లు. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి దరఖాస్తును ఆగస్ట్ 7వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 8, 2014. రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 24, 2014. పరీక్ష కేంద్రం: ఉస్మానియా మెడికల్ కాలేజ్- హైదరాబాద్. హాల్‌టికెట్లను గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్- హైదరాబాద్ నుంచి ఆగస్ట్ 21, 22 తేదీల్లో పొందొచ్చు. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: {పిన్సిపల్, గవర్నమెంట్ నిజామియా తబ్బి కాలేజ్, చార్మినార్ దగ్గర, హైదరాబాద్-500 002. వివరాలకు: http://ntruhs.ap.nic.in -
విజయవాడలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
సాక్షి, విజయవాడ : విజయవాడలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎట్టకేలకు ఈ ఆస్పత్రి విషయంపై స్పష్టత ఇచ్చారు. నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలో మళ్లీ సూపర్‌స్పెషాలిటీ వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికార పార్టీ స్థానిక నేతలు కూడా ఎన్నికల సమయంలో నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిం చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడలోనే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ప్రకటించారు. ఈ హాస్పిటల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉంటుందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తారు. విజయవాడలో సాధారణ ప్రభుత్వ వైద్యశాల ఉంది. అయితే ఈ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఎక్కువ లేవు. దీంతో వైద్యశాలకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ప్రభత్వ వైద్యశాలలో 790 పడకలు, ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలు, మరో 15 వరకూ సాధారణ విభాగాలు ఉన్నాయి. రోజుకు సగటున 1500 మంది అవుట్‌పేషెంట్లు వైద్యశాలకు వస్తున్నారు. 700 మంది ఇన్ పేషెంట్లు నిత్యం ఆస్పత్రిలో ఉండి చికిత్సపొందుతున్నారు. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఉన్నప్పటికీ మెరుగైన వైద్యసేవలు ఇక్కడ లభించక ఎక్కువ మంది రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేదలకు అధునాతన వైద్యం ఉచితంగా లభిస్తుంది. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మారడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విషయం మరుగున పడింది. ప్రసుత్తం మంత్రి కామినేని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టుకు పాత ప్రాజెక్టుకు పొంతన లేదు. ఇది పూర్తిగా 90 శాతం కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టు. ప్రసుత్తం ఉన్న హాస్పిటల్ సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కాలేజీ రెండు పక్కపక్కనే ఉన్నాయి. అయితే మెడికల్ కళాశాల ప్రాంగణంలో సుమారు 30 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటికీ అనుబంధంగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూపర్‌స్పెషాలిటీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. సుమారు రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.135 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.15 కోట్లతో ఆస్పత్రి నిర్మిస్తారు. దీంతో మరో 15 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చేఅవకాశం ఉంది. -
‘ఆరోగ్య’ వెబ్‌సైట్‌కు అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌కు అనారోగ్యం పట్టుకుంది. నెల రోజులుగా ఆ వెబ్సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై హైదరాబాద్‌లో వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ)కి ఫిర్యాదు చేశామని, అయినా స్పందన లేదని పలువురు వైద్య విద్యార్థులు, అధ్యాపకులు చెబుతున్నారు. అది తమ పరిధిలో లేదని, విజయవాడ వెళ్లి యూనివర్సిటీలో కనుక్కోవాలని డీఎంఈ సూచించారని వారు పేర్కొంటున్నారు. సాధారణంగా వర్సిటీ పరిధిలో అడ్మిషన్లు, ఫలితాలు, కౌన్సెలింగ్ తదితర వివరాలన్నీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్‌తో పాటు ఎన్ఆర్ఐ, యాజమాన్య కోటా సీట్ల భర్తీ కూడా జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో సీట్ మ్యాట్రిక్స్ విధానంలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి? తదితర సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఉంచాలి. కానీ, ఆ సమాచారం తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా www.ntrhus.ap.nic.in వెబ్సైట్ పనిచేయలేదు. దీనిపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు అందినా స్పందన కరువయింది. కాగా.. నెల రోజులుగా ఎంత ప్రయత్నించినా వెబ్సైట్ పనిచేయలేదని.. దీనిపై డీఎంఈకి, వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని ఒంగోలుకు చెందిన రాజశేఖర్ అనే ఈ-సేవా కేంద్రం నిర్వాహకుడు తెలిపారు.