సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగంలో ఎకానమీ అత్యంత కీలకమైంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 20-25 ప్రశ్నలు ఎకానమీ సంభందిత అంశాలు నుంచి వచ్చాయి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు ఎకానమీ సంబంధిత ప్రశ్నలుగా ఉండటాన్ని గమనించవచ్చు. ప్రిలిమ్స్‌కు సరిగా సన్నద్ధం అయితే ఆ ప్రిపరేషన్ మెయిన్స్‌కు కూడా ఉపకరిస్తుంది.
గత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల ఆధారంగా ఏ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయో చూస్తే, వాటిలో ముఖ్యంగా..
జాతీయాదాయం- ఆదాయ పంపిణీ
పన్నుల వ్యవస్థ
బ్యాంకింగ్ రంగం
అంతర్జాతీయ వాణిజ్యం
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు.
మానవాభివృద్ధి
పంచవర్ష ప్రణాళికలు
పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం
జనాభా (2011 గణన), ఆర్థికాభివృద్ధి
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు
అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
వివిధ రిపోర్టులను ప్రచురించే సంస్థలు
ఆహార భద్రత కేంద్ర బడ్జెట్
ఆర్థిక సంస్కరణలు మూలధన మార్కెట్
ఈ అంశాలపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.
జాతీయాదాయం
జాతీయాదాయంలో భాగంగా మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి; స్థూల దేశీయోత్పత్తి; నికర జాతీయోత్పత్తి; వ్యష్టి ఆదాయం; వ్యయార్హ ఆదాయం; తలసరి ఆదాయం వంటి ప్రాథమిక భావనలను అధ్యయనం చేయాలి. రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయంలో భాగంగా అధిక, అల్ప తలసరి ఆదాయాలను నమోదు చేసుకున్న రాష్ట్రాలను పరిశీలించాలి. జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాకు సంబంధించి అవగాహన అవసరం.
బ్యాంకింగ్ రంగం
ఈ రంగానికి సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ పరపతి నియంత్రణలో భాగంగా పరిమాణాత్మక, విచక్షణాత్మక సాధనాలపై గతంలో ప్రశ్నలు వచ్చాయి. ఆయా సాధనాలు ద్రవ్యత్వం, ద్రవ్య సప్లయ్‌పై ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. బ్యాంకు రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, మార్జిన్ అవసరాలు, వినియోగదారుని పరపతి నియంత్రణ వంటి భావనలపై అవగాహన అవసరం. బ్యాంకింగ్ రంగంలో నరసింహం కమిటీ, నాయక్ కమిటీ సిఫార్సులు పరిశీలించాలి. బ్యాంకుల జాతీయీకరణపై అవగాహన అవసరం.
పన్నుల వ్యవస్థ
పన్నుల వ్యవస్థలో భాగంగా అమ్మకం పన్ను, విలువ ఆధారిత పన్ను, కార్పొరేషన్ పన్ను, ఎక్సైజ్ పన్ను, ఆదాయపు పన్నుతోపాటు రాష్ట్రాలు, స్థానిక సంస్థలు విధించే పన్నులపై అధ్యయనం అవసరం. గత ప్రశ్నపత్రాల్లో ఆయా విభాగాలకు సంబంధించి ప్రశ్నలు వచ్చాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ పన్నులకు సంబంధించి ఏయే పన్నుల ద్వారా రాబడి తగ్గుతోందో, పెరుగుతోందో అనే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు గత ప్రశ్నపత్రాల్లో ఉన్నాయి. వీటితోపాటు ఆర్థిక సంఘం విధులు, 13, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులపై అవగాహన పెంపొందించుకోవాలి.
అంతర్జాతీయ వాణిజ్యం
అంతర్జాతీయ వాణిజ్యంలో భాగంగా వాణిజ్య లోటు, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో భాగంగా కరెంట్ అకౌంట్, మూలధన అకౌంట్‌పై అధ్యయనం అవసరం. గత ప్రశ్నపత్రాల్లో కరెంట్, మూలధన అకౌంట్‌లో ఇమిడి ఉండే వివిధ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. ఎగుమతి-దిగుమతి విధానం, వర్తక నిబంధనలు, ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రిత్వ సమావేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ద్వైపాక్షిక, నియమావళి ఆధారిత బహుళ వాణిజ్య ఒప్పందాలను అధ్యయనం చేయాలి.
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు
భారత ఆర్థిక వ్యవస్థలో స్వాతంత్య్రానంతరం నిర్మాణాత్మక మార్పుల్లో భాగంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ప్రగతిని పరిశీలించాలి.వ్యవసాయ రంగం: గత ప్రశ్నపత్రాల్లో ఆహార భద్రత, హరిత విప్లవం, వ్యవసాయ పరపతి, వ్యవసాయ మార్కెటింగ్, భూ సంస్కరణలపై ప్రశ్నలు వచ్చాయి.పారిశ్రామిక రంగం: గత ప్రశ్నపత్రాల్లో పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక పరపతి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, తయారీ విధానం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. మేక్ ఇన్ ఇండియాతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రోత్సాహకాలను పరిశీలించాలి. సేవా రంగం: జాతీయాదాయంలో సేవా రంగం వాటా, ఈ రంగం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి కారణాలపై అవగాహన అవసరం.
పంచవర్ష ప్రణాళికలు
గత ప్రశ్నపత్రాల్లో పంచవర్ష ప్రణాళికలకు అధిక ప్రాధాన్యామిచ్చారు. ముఖ్యంగా వివిధ పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, రంగాల వారీగా వనరుల కేటాయింపు, పేదరిక-నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, సమ్మిళిత వృద్ధి, ప్రణాళికా యుగంలో సాధించిన విజయాలు, అపజయాలకు సంబంధించి ప్రశ్నలు వచ్చాయి. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన నీతి ఆయోగ్‌కు సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణానికి కారణాలు, రకాలు, టోకు ధరల సూచీ, వినియోగ ధరల సూచీ, స్టాగ్‌ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు తీసుకునే చర్యలు తదితరాలపై గతంలో ప్రశ్నలు వచ్చాయి. ఇటీవల కాలంలో భారత్‌లో అల్ప ద్రవ్యోల్బణానికి కారణాలు, టోకు ధరల సూచీ, వినియోగదారుల ధరల సూచీ లెక్కింపులో ఆధార సంవత్సర మార్పుతోపాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల తగ్గుదల కారణాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
పేదరికం-నిరుద్యోగం
పేదరికంలో భాగంగా నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలతోపాటు ఆయా కార్యక్రమాల విలీనం వంటి అంశాలపై గతంలో పశ్నలు వచ్చాయి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన అవసరం. నిరుద్యోగంలో రకాలైన ప్రచ్ఛన్న, బహిర్గత, నిర్మాణాత్మక, చక్రీయ, ఘర్షిత నిరుద్యోగం,శ్రామిక శక్తి, పనిలో పాల్పంచుకునే రేటు వంటి అంశాలపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.
జనాభా
ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ‘జనాభా’ అతిముఖ్యమైన అంశంగా పరిగణించాలి. 2011 గణనను పూర్తిగా అధ్యయనం చేయాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి జనసాంద్రత, లింగ నిష్పత్తి, ఎస్సీ, ఎస్టీ జనాభా వంటి అంశాలపై గతంలో ప్రశ్నలు వచ్చాయి.
Practice Bits
1. Which of the following instruments for qualitative or selective control of credit are used by Reserve Bank of India
1. Margin Requirement 2. Moral suasion 3. Credit rationing 4. Cash Reserve ratio
Select the correct answer using the codes given below:
a) 1 and 2 b) 2 and 4
c) 1, 2 and 3 d) 3 and 4
2. Non-performing assets of commercial Banks mean their loans
a) For which interest/instalment has remained unpaid well after due date
b) which have not been disbursed at all
c) given to sick industrial units
d) fetching very low rate of interests
3. The Reserve Bank of India act as a banker's bank. This would imply which of the following?
1. Other banks retain their deposits with the RBI
2. RBI lends funds to the commercial banks in times of need
3. RBI advises the commercial banks on monetary matters.
Select the correct answer using the codes given below:
a) 2 and 3 b) 1 and 2
c) 1 and 3 d) 1, 2 and 3
4. Which of the following would facilitate combating inflation in india
1) Better capacity utilization
2) Reduction in budgetary deficit
3) Increase in exports
4) More efficient public distribution system
Select the correct answer using the codes given below:
a) 1, 2, 3 and 4 b) 1, 2 and 4
c) 2 and 3 d) 1 and 4
5. Agricultural taxation in india is difficult because of
a) scattered nature of landholdings
b) the fact that agriculture is niot taxed anywhere in the world
c) seasonality of production
d) Increasing the overhead cost of tax collection and the lack of political will
6. Which one of the following heads of exp-enditure of the central government acco-unts for the largest amount of revenue expenditure in 2015-16 union budget
a) Interest payments
b) defence c) Subsidies
d) Grants to states and union territories
7. Which one of the following is NOT correctly matched
a) Rural Credit : NABARD
b) Industrial Finance : Industrial Finance Corporation of India
c) Urban poverty : Mahatma Gandhi National Rural Employment Programme
d) Disguised Unemployment : Subsistence agriculture
8. The GNP gap is the gap between
a) GNP and NNP b) GNP and GDP
c) potential and actual GNP
d) GNP and depreciation
9. Which of the following items may be included in the current account of the Balance of payments statement?
1. Merchandise exports
2. Banking, insurance and transport services
3. Foreign tourists expenditure in home country
4. Income received on investment abroad
5. Foreign short-term investment in home country
Select the correct answer using the codes given below:
a) 1 only b) 5 only
c) 1, 3 and 5 d) 1, 2, 3 and 4
10. Consider the following rural development programmes
1. IRDP 2. JRY
3. Community development programme
4. Food for work programme
The correct chronological sequence of the launching of these programmes by the government is
a) 2, 1, 4, 3 b) 3, 4, 1, 2
c) 1, 2, 3, 4 d) 4, 3, 1, 2
11. India's first Railway-line built under PPP model is
a) Gandhidham and Tuna-Tekra Port
b) Nagpur-Delhi
c) Kakinada-Visakhapatnam port
d) Nellore-Krishnapatnam port
12. The total outlay approved by cabinet committee on economic affairs for Pradhan Mantri Krishi Sinchayee Yojana for the period 2015-16 to 2019-20
a) Rs. 40000 crores b) Rs.50000 crores
c) Rs.55500 crores d) Rs.60000 crores
13. World Investment Report was published by
a) World Bank
b) International Monetary Fund
c) World Trade Organization
d) United Nations conference on Trade and Development (UNCTAD)
ప్రిలిమ్స్‌లో విజయానికి ఎకానమీ
Published Thu, Jul 23 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement