ఎండవేడిమి చర్మం, శిరోజాల మీద అధిక ప్రభావం చూపుతుంది. విరుగుడుగా మనమే కొన్ని జాగ్రత్తలను పాటించి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎండకాలం తీవ్రతను కవర్ చేసేయొచ్చు.
కమిలిన చర్మానికి కలబంద
ఎండకు కమిలిన చర్మానికి కలబంద మంచి ఉపశమనం ఇస్తుంది. కలబంద రసాన్ని ఐస్‌ట్రేలో పోసి ప్రీజర్‌లో సిద్ధంగా ఉంచాలి. కలబంద క్యూబ్‌తో కమిలిన చర్మం మీద మృదువుగా రబ్ చేయాలి. ఇది వెంటనే రిలీఫ్ ఇవ్వడంతో పాటు ట్యాన్ తగ్గిస్తుంది.
తాజాదనానికి రోజ్‌వాటర్
ఇంట్లో రోజ్‌వాటర్‌ని ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దూది ఉండను చల్లని రోజ్‌వాటర్‌లో ముంచి, దాంతో ముఖమంతా తుడవండి. కళ్ల చుట్టూ మరోమారు తుడవాలి. దీంతో మీకు అలసట తీరిపోయి ఫ్రెష్‌గా కనిపిస్తారు.
పొడి జుట్టుకు తేనె
తేనె, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. జుట్టుకు, మాడుకు పట్టించాలి. షవర్‌క్యాప్‌తో జుట్టునంతా కవర్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పొడిజుట్టుకు మంచి కండిషనింగ్ లభిస్తుంది.
కాలిమడమలకు సముద్రపు ఉప్పు
బంగాళదుంపను సగానికి కట్ చేసి, దానిని ఉప్పుతో రుద్ది కాలి మడమల భాగంలో రబ్ చేయాలి. తర్వాత వాజెలిన్ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేయాలి. కొన్నిరోజుల్లోనే మీ పాదాల పగుళ్లు తగ్గి, చర్మం మృదువుగా అవుతుంది.
చిట్లిన వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్
వేసవిలో స్విమ్మింగ్ చేసేవారికి తలవెంట్రుకులు బాగా పొడిబారడం, చిట్లడం వంటì సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి విరుగుడుగా.. స్విమ్మింగ్ చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల కండిషన్ దెబ్బతినదు. జుట్టు దురద పెడుతుంటే చల్లటి పెరుగును జుట్టుకు పట్టించి 10 నిమిషాలు సేదదీరండి. తర్వాత శుభ్రపరుచుకోండి. దురద తగ్గడమే కాకుండా జుట్టుకు పెరుగు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment