►కావలసినవి:
ఓట్స్ – 1 కప్పు; నీరు – 2 కప్పులు; ఆపిల్ – 1;
నిమ్మరసం – 2 టీ స్పూన్లు; కిస్‌మిస్ – 1 టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – 1 టేబుల్ స్పూన్; పాలు – 1 కప్పు; తేనె – 2 టీ స్పూన్లు
తయారి:
►రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి.
►ఉదయాన ఆపిల్ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి.
►తర్వాత ఇందులో కిస్‌మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్ వేసి కలపాలి.
►పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి.
నోట్: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు.
హెల్దీ ట్రీట్
Published Mon, Feb 18 2019 1:38 AM | Last Updated on Mon, Feb 18 2019 1:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment