
ఎల్‌ఈడీలు ఇక మరింత చౌక!
\ఎల్‌ఈడీ లైట్లు తక్కువ విద్యుత్తు వాడతాయి... ఎక్కువకాలం మన్నుతాయి. కానీ ఒక్కో బల్బు ఖరీదు అయిదారు వందల రూపాయలకు తక్కువేమీ ఉండదు. కరెంటు ప్రవాహంలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు ఈ బల్బుల్లో ఏర్పాటు చేసే డ్రైవర్లతో ధర అమాంత పెరిగిపోతోంది.
జర్మనీలోని ఫ్రాన్‌హోవర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ పరిస్థితి మారనుంది. ఎల్‌ఈడీ బల్బుల ఖరీదును గణనీయంగా తగ్గించగలిగే గాలియం నైట్రైడ్ ట్రాన్సిస్టర్లను తయారు చేసిందీ సంస్థ. ఈ ట్రాన్సిస్టర్లతో కూడిన డ్రైవర్లు సంప్రదాయ సిలికాన్ ట్రాన్సిస్టర్ల కంటే పదిరెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తాయి ఇవి. చిత్రంలో కనిపిస్తున్నది గాలియం నైట్రైడ్ ట్రాన్సిస్టర్లతో కూడిన ఎల్‌ఈడీ బల్బే.