నా వయసు 23 ఏళ్లు. నాకు పెళ్లయి ఏడాది అయ్యింది. ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతిని. బిడ్డ తెల్లగా పుట్టాలంటే పాలలో కుంకుమపువ్వు కలుపుకొని తాగమని మా పెద్దలు చెబుతున్నారు. ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందా? నాకు వివరంగా చెప్పండి.
- స్వరూప, మేడ్చల్
పుట్టబోయే బిడ్డ రంగు... తల్లిదండ్రుల, రక్తసంబంధీకుల జన్యువుల నుంచి వస్తుంది. అంతేగానీ మనం తినే ఆహారానికి, బిడ్డ రంగుకూ ఎలాంటి సంబంధం ఉండదు. గర్భంలో పిండం ఏర్పడినప్పుడే, జీన్స్ ద్వారా బిడ్డ రంగు నిర్ధారణ అయి ఉంటుంది. అంతేగానీ... మనం తినే ఆహారాల వల్ల బిడ్డ రంగు ఎప్పటికీ మారదు. మీరు అన్ని రకాల పాలు, పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, కూరగాయలు తినండి... మాంసాహారం మితంగా తీసుకోండి. వీటి వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. పుట్టబోయే బిడ్డ రంగు గురించి ఆలోచించకండి, ఆందోళన పడకండి. రంగు కంటే ఆరోగ్యం ముఖ్యం అని గుర్తించండి.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
గైనిక్ కౌన్సెలింగ్
Published Fri, May 22 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement