
అదేదో సినిమా పాటలో సోలో బతుకే సో బెటరు అనేసినంత మాత్రాన అదేమీ జీవిత సత్యం కాదు. ఒంటరి బతుకు బతకడం ఒంటికేమంత మంచిది కాదు. కుటుంబ జీవితం గడిపేవారితో పోలిస్తే ఒంటరిగా బతికే వారిలో గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు రెట్టింపుగా ఉంటాయని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 45 ఏళ్ల పైబడ్డ వారిలో 4.26 కోట్ల మంది ఒంటరిగా బతుకుతున్నారు. వీరిలో చాలామందికి టీవీ చూడటమే ప్రధానమైన కాలక్షేపం.
చిరుతిళ్లు తింటూ, మద్యం సేవిస్తూ, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో పట్టించుకోకుండా గంటలకు గంటలు టీవీ ముందు గడిపేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయినవారి అండదండలు లేకపోవడం, సామాజిక సంబంధాలు పెద్దగా లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఇలాంటి వారి డిప్రెషన్ బారినపడుతున్నారని, జీవితం మీద లక్ష్యంగా లేకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరమై గుండెజబ్బుల బారినపడుతున్నారని, ఫలితంగా అకాల మరణాలకు బలైపోతున్నారని బర్మింగ్‌హామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జూలియన్ హోల్ట్ లున్‌స్టాండ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment