♦ తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే..
సినిమా పాటకు ఒక నమూనాను ఇచ్చిన కవి, వేటూరి సుందరరామ్మూర్తి. అటు పండితులూ పామరుల కోసమూ, ఇటు పండితుల్లోని పామరుల కోసమూ అన్ని రకాల పాటలనూ రాశారు. ‘పదహారేళ్ల వయసు’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ మాత్రం అన్ని వర్గాలనూ మెప్పించే పాట.
అందులోని ఈ పాదాలు చూడండి: ‘తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే/ కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే’. ఇందులో వాక్యాల్లోని సొగసు ఎంత ముఖ్యమో, ఒక కన్నెపిల్ల మానసిక స్థితిని సరిగ్గా పట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇది మంచి కవిత్వం అయింది. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘పతినారు వయతినిలే’కు రీమేక్ అయిన ఈ సినిమాకు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. మూలచిత్రానికి ఇళయరాజా ఇచ్చిన బాణీనే తెలుగులోనూ సంగీత దర్శకుడు చక్రవర్తి వాడుకున్నారు. పాడింది అక్కడా ఇక్కడా కూడా ఎస్.జానకి. నాయిక కూడా అక్కడా ఇక్కడా శ్రీదేవే!
Comments
Please login to add a commentAdd a comment