హన్సికకు భలే డిమాండ్ | Hansika Put Her Paintings For Sale! | Sakshi
Sakshi News home page

హన్సికకు భలే డిమాండ్

Published Fri, Feb 12 2016 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

హన్సికకు భలే డిమాండ్ - Sakshi

హన్సికకు భలే డిమాండ్

 నటి హన్సిక చిత్ర లేఖనాలు అమ్మకానికి రెడీ అవుతున్నాయి. హన్సిక అందమైన నటి అని మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే ఈ ముద్దుగుమ్మలో అందమైన చిత్ర కళాకారిణి ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చదువుకునే రోజుల్లోనే తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పోటీల్లో పలు బహుమతులను గెలుచుకున్నారట. తన నటిగా బిజీగా ఉన్నా ఇప్పటీకీ సమయం దొరికినప్పుడల్లా అందమైన చిత్రలేఖనాలను క్యాన్వాస్‌పై ఆవిష్కరిస్తుంటారట. అలా ఆమె చేతి నుంచి జాలు వారిన పెయింటింగ్స్‌లో అధికంగా దేవుళ్ల రూపాలే ఉంటాయట.
 
  అందులోనూ శ్రీకృష్ణుడిని వివిధ రూపాల్లో చిత్రీకరించిన చిత్రలేఖనాలే ఉంటాయట. హన్సిక చిత్ర లేఖనాల్లో 10 లక్షలకు అమ్ముడు బోయిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయట. అలా ఈ సారి చెన్నైలో తన చిత్రలేఖనాల ప్రదర్శన ఏర్పాటుకు హన్సిక సన్నాహాలు చేస్తునట్లు సమాచారం. అభిమానులూ హరీ అప్.మీ అభిమాన నటి చిత్ర లేఖనాలను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. హన్సిక తన ప్రతి పుట్టిన రోజుకు ఒకరి చొప్పున అనాధ బాలలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే.
 
 అలా ఇప్పటికి 25 మంది బాలబాలికల సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ మానవతావాది తన చిత్రలేఖన ప్రదర్శనతో వచ్చిన డబ్బును ఆ బాలల కొరకే వెచ్చించనున్నారట. ఇది ఆదర్శనీయమైన ఆలోచనే కదా. ఇప్పటి వరకూ అబినయంతో పాటు అందాలను ఆరబోస్తున్న హన్సిక ఇకపై అందాలారబోత విషయంలో హద్దులు విధించుకోవాలని,నటనకు ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్నట్టు అరణ్మణై-2 చిత్రంతో ఈ ఏడాది విజయ పయనం ప్రారంభించిన ఈ బ్యూటీ నటించిన పోకిరిరాజా 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతోందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement