విశ్వకవి అల్లామా ఇక్బాల్
‘‘అమ్మా ఈ రోజు మన మేక పాలివ్వలేదా? రోజులాగే ఈ రోజు పాలగ్లాసు ఇవ్వలేదేంటమ్మా?’’
‘‘నాయనా ఈ రోజు మన మేక పక్కింటి వాళ్ల చేలో పడి మేసింది. అందుకే ఈ రోజు ఆ పాలు నీకు తాగించడం కంటే నిన్ను పస్తులుంచడమే మంచిది. అక్రమంగా మన కడుపు నింపుకోవడం పాపం నాయనా’’ తన కొడుకు పోషణలో ఆ తల్లి అన్నన్ని జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే ఆ అబ్బాయి పెద్దయ్యాక మనదేశ పేరుప్రఖ్యాతుల్ని ప్రపంచానికి చాటిచెప్పేంత విశ్వకవి అయ్యాడు. ‘సారే జహాసే అచ్ఛా హిందుస్తా హమారా’ అని ఈ రోజు మనం పాడుకుంటున్నామంటే ఆయన కలం మహత్యమే. ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయనెవరో. విశ్వకవి అల్లామా ఇక్బాల్ (రహ్మాలై) మాతృమూర్తి ఇంత పవిత్ర భావాలతో పెంచి పెద్దచేసింది కాబట్టే ఆయన అంత గొప్పకవిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ‘సారే జహాసే అచ్ఛా’ గేయం లేని పాఠ్యపుస్తకమంటూ ఈ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదేమో.
అక్రమ ఆర్జనను, అవినీతి సొమ్మును గురించి అక్రమంగా సంపాదించిన సంపదకంటే చావే మేలు అన్న అర్థం వచ్చేలా ఆయన కవితలు కూడా రాశారు.
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment