Allama Iqbal Mahmood
-
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
ఆ పాలు వద్దనుకున్నా!
‘‘అమ్మా ఈ రోజు మన మేక పాలివ్వలేదా? రోజులాగే ఈ రోజు పాలగ్లాసు ఇవ్వలేదేంటమ్మా?’’ ‘‘నాయనా ఈ రోజు మన మేక పక్కింటి వాళ్ల చేలో పడి మేసింది. అందుకే ఈ రోజు ఆ పాలు నీకు తాగించడం కంటే నిన్ను పస్తులుంచడమే మంచిది. అక్రమంగా మన కడుపు నింపుకోవడం పాపం నాయనా’’ తన కొడుకు పోషణలో ఆ తల్లి అన్నన్ని జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే ఆ అబ్బాయి పెద్దయ్యాక మనదేశ పేరుప్రఖ్యాతుల్ని ప్రపంచానికి చాటిచెప్పేంత విశ్వకవి అయ్యాడు. ‘సారే జహాసే అచ్ఛా హిందుస్తా హమారా’ అని ఈ రోజు మనం పాడుకుంటున్నామంటే ఆయన కలం మహత్యమే. ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయనెవరో. విశ్వకవి అల్లామా ఇక్బాల్ (రహ్మాలై) మాతృమూర్తి ఇంత పవిత్ర భావాలతో పెంచి పెద్దచేసింది కాబట్టే ఆయన అంత గొప్పకవిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. ‘సారే జహాసే అచ్ఛా’ గేయం లేని పాఠ్యపుస్తకమంటూ ఈ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదేమో. అక్రమ ఆర్జనను, అవినీతి సొమ్మును గురించి అక్రమంగా సంపాదించిన సంపదకంటే చావే మేలు అన్న అర్థం వచ్చేలా ఆయన కవితలు కూడా రాశారు. – ముహమ్మద్ ముజాహిద్ -
సారే జగాసే అచ్ఛా
అల్లామా మహమూద్ ఇక్బాల్ (1877 నవంబర్ 9- 1938 ఏప్రిల్ 21). ఇక్బాల్‌గా మధ్యధరా దేశాలకు, ఉపఖండం ప్రజలకు పరిచితుడు. ప్రపంచ ప్రజలకు తూర్పుదేశాల కవి. భారతీయులకు ఇక్బాల్ అంటే ‘సారే జహా సే అచ్ఛా’! పాకిస్తానీయులకు జాతీయ కవి! గాయత్రి మంత్రం తన ప్రార్థనగా, ‘రాముడు హిందుస్తాన్ ఇమామ్’గా అభివర్ణించిన ఇక్బాల్ వంటి జాతీయవాదులు తర్వాతి కాలంలో ‘విభజన ఆలోచన’ ఎందుకు చేయవలసి వచ్చిందో, నేపథ్యమేమిటో అధ్యయనం చేస్తోన్న అభిమానులు ఉభయ దేశాల్లోనూ ఉన్నారు! అదలా ఉంచితే.. ఇక్బాల్‌కు ైెహదరాబాద్ ఒయాసిస్! ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య అనంతరం లాహోర్‌లో కొన్నాళ్లు ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వృత్తి జీవితానికి రోసిల్లాడు. జర్మన్ మహాకవి గోథేలా నచ్చింది చదువుతూ - రాస్తూ సాహితీ ప్రపంచంలో విహరించాలని ఇక్బాల్ భావించారు. ఎలా సాధ్యం? ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ అనే ఉద్యానవనంలో ఆయన ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ అనే పచ్చని చెట్టు కొమ్మలనే చేతులతో ఆహ్వానించింది. 1910 డిసెంబర్ 21వ తేదీన తొలిసారి హైదరాబాద్ వచ్చారు. కిషన్ ప్రసాద్ నివాసంలో ముషాయిరాలో పాల్గొన్నారు. పౌర్ణమి రాత్రి కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించారు. ఆ వాతావరణం ఆయనతో ‘గొరస్తాన్ -ఎ-షాహీ (రాజుల సమాధులు)’ అనే ‘నజమ్’ను పలికించింది. ‘ఆస్మాన్ బాదల్ కా పెహెనే కిర్కా-ఎ-దరీనా హై’ అంటూ రాజ్యాల ఉత్థాన పతనాల కవనాన్ని కళాపోషకుల వహ్వా వహ్వాల మధ్య వినిపించారు ఇక్బాల్. ఈ షాయరీని https://rekhta.org/nazms/ goristaaneshaahiialla maiqbalnazms లింక్‌లో వినవచ్చు. అందులోని కొన్ని చరణాలు, తెలుగులో.. ఆకాశం ధరించిన మేఘాల ‘పురా-నవ’ దుస్తులు చంద్రుని నొసటి అద్దంపై దోగాడుతున్నాయి నీరవ నిశ్శబ్దంలో చంద్రకాంతి లీలగా ఉంది రాత్రి ఒడిలో ఉదయం నిద్రిస్తోంది ఆకు కదలని నిశ్శబ్దం ఎంత చిత్రం ఈ నిశ్శబ్దం ప్రకృతి వీణియపై మౌనరాగం విశ్వహృదయపు ప్రతి అణువులో ముప్పిరిగొన్న వేదన వర్తమానపు పెదవులపై విచారపు వ్యక్తీకరణలా నిశ్శబ్దం ఓహ్! ఆ కోట, కదనకాహకాల మైదానం భుజాలపై వేల వత్సరాల భారాన్ని మోస్తోంది ఒకానొక కాలంలో జీవంతో రాజిల్లిన నేటి నిస్తేజపు ఒంటరి ఈ నిశ్శబ్దం పాత వైభవానికి సమాధిగా తోస్తోంది తన ప్రేమికుల్లో నిలచిన ఒకే ఒక అవశేషం ఈ కోట కొండపై జ్ఞాపకాలను పహారా కాస్తున్న ఏకాకిలా ఉంది ఆకాశపు కప్పు నుంచి మబ్బు కిటికీలోంచి ఒక చిన్నారి ఆకుపచ్చని నక్షత్రం భువిని చూస్తోంది. ఈ లోకం పోకడ ఆ తారకు పసిబాలల ఆటలా తోస్తోంది మానవ వైఫల్యపు గాథ తనకు కంఠతా వచ్చులా ఉంది ఈ ప్రయాణికుడి నిరంతర గమ్యయానాన్నీ విప్లవాల తమాషాను ఆకాశం నుంచి చూస్తోంది నింగిలోని తారలు నేలపై మౌనాన్ని పాటించడం వీలుకానప్పటి కీ చనిపోయిన వారి కోసం ఆ నక్షత్రం ఒక్క క్షణం మౌనం పాటించింది నేల ఎన్నెన్నో జీవన క థాపుష్పాల సమాహారం అంతరించిన ఎన్నెన్నో నాగరికతలు ఈ పొరల్లో ఉన్నాయి ఈ వేదనల శరభూమి రాజుల విశ్రాంతి స్థలి ఓ కాఠిన్య నేత్రమా వెచ్చని కన్నీటితో నివాళించుమా! ఇది సమాధి స్థలమే కాని ఇక్కడి ధూళి ఆకాశోన్నతం ఈ ధూళి రాశి ఒక దుర దృష్ట జాతి సంపద ఈ మరుస్థలిలోని మహోన్నత భవనాల రాజసం ‘అన్నీ చూసేవాడు’ కడగంటి చూపుతో మెచ్చుకునేలా ఉంది పదాలు ఆ అనిర్వచనీయతను పట్టుకోలేకపోతున్నాయి వర్ణన అనే అద్దంలో చూపేందుకు వీలుకాని సౌందర్యం ఇది నెరవేరని కోర్కెలతో అసహనపు నిట్టూర్పులతో నిద్రించే జన సమూహాలకు దూరంగా నిశ్శబ్దం నిదురిస్తోంది చిక్కని సమాధుల నలుపు ఉషోదయానికి వేదిక ఆ గుమ్మంలోంచే కదా వెలుతురు ప్రసరించేది