
సినిమా తారలకు అభిమానుల నుంచి ఊహించని తలనొప్పులు వస్తుంటాయి! హన్సికలాంటి అందమైన అమ్మాయి అయితే హెడ్డేక్స్ కాస్త ఎక్కువే. ఆమెను టచ్ చేసి గతంలో ఒక వ్యక్తి చెంపదెబ్బ కూడా తిన్నాడు. ఇప్పుడు మన్నై సాథిక్ అనే వ్యక్తి హన్సికను ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ఏకంగా ఒక వీడియోనే సోషల్ మీడియాలో వదిలాడు. అదిప్పుడు వైరల్ అయి, హన్సికను నిజంగా అభిమానించే వారి మనసును నొప్పిస్తోంది. తెలుగులో ‘దేశముదురు’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన హన్సిక అంతకు ముందు నాలుగు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ఇప్పటి వరకు నాలుగు దక్షిణాది భాషల్లో కలిపి సుమారు యాభై చిత్రాల్లో యాక్ట్ చేశారు.
తెలుగులో ఆమె లేటెస్ట్ చిత్రం ‘గౌతమ్ నందా’. దేశముదురు తర్వాత హన్సికకు సినిమా ఛాన్సుల కన్నా పెళ్లి ప్రపోజల్సే ఎక్కువ వచ్చాయి! అయితే అవన్నీ ఉత్తరాల్లో, ఫోన్‌లలో వెళ్లిన ప్రపోజల్స్. ఇప్పుడు సాథిక్ అనే ఆ అపరిచితుడు డైరెక్టుగా వీడియోనే రిలీజ్ చేశాడు. సినిమాలు ఉన్నా లేకున్నా, ఎప్పుడూ అనాథ బాలల సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయి ఉండే హన్సిక వరకు ఆ వీడియో విషయం వెళ్లి ఉండకపోవచ్చు. తెలిసి ఉంటే ఈ పాటికి ముంబై పోలీసులు ఆ ఉన్మాది కోసం వేట మొదలుపెట్టి ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment