షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ హాకీ టీమ్‌లో కనిపించి, గత నవంబరులో క్రికెటర్ జహీర్ ఖాన్‌ని పెళ్లి చేసుకుని గృహిణి జీవితంలోని కొత్త బాధ్యతల్లో మునిగితేలుతున్న సాగరికా ఘాట్గే.. త్వరలోనే ఫుట్‌బాల్ టీమ్‌లో కనిపించబోతున్నారు! మరాఠీ దర్శకుడు మిలింద్ ఉకే తీస్తున్న ‘మాన్‌సూన్ ఫుట్‌బాల్’ చిత్రంలో ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడిన గృహిణుల జట్టులో ఒక సభ్యురాలి పాత్రతో సాగరిక తిరుగులేని ఒక గోల్ కొట్టడం కోసం ప్రస్తుతం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు.
‘‘సాగరిక ఈ సినిమాకు నా బెస్ట్ చాయిస్. ఆమెకూ ఈ సబ్జెక్టు నచ్చింది’’ అని చెప్తున్న ఉకే.. చూస్తుంటే సాగరిక చుట్టూనే తన కథను అల్లుకున్నట్లు కనిపిస్తోంది. చిత్రం షూటింగ్ జూలైలో మొదలవుతోంది. ఈలోపే సాగరిక ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నారు. 2007లో ఛక్ దే తర్వాత ఫాక్స్, మిలే న మిలే హమ్, రష్, ప్రేమచి గోష్ట (మరాఠీ), జీ భర్ కె జీ లీ, దిల్ దారియాన్ (పంజాబీ), ఇరాద (2017) చిత్రాలలో సాగరిక నటించారు.
ఇప్పుడీ ‘మాన్‌సూన్ ఫుట్‌బాల్’.. పెళ్లయ్యాక తొలిసారి ఆమె నటిస్తున్న చిత్రం. సాగరిక మరాఠీ యువతి. కొల్హాపూర్‌లో పుట్టారు. ఎనిమిదేళ్ల వరకు అక్కడే ఉన్నారు. తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్ వెళ్లి, అక్కడి ‘మాయో కాలేజ్ గర్స్›్ల స్కూల్’ లో చదివారు. సాగరిక నేషనల్ లెవెల్ హాకీ ప్లేయర్ కూడా. ఆ ప్రతిభ కారణంగానే ఆమెకు ఛక్ దే ఇండియాలో అవకాశం వచ్చింది. విరాట్, అనుష్కలా.. సాగరిక, జహీర్‌లది లవ్ మ్యారేజ్. క్షణమైనా ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ జంట.. తొలిసారి కళ్లు కళ్లు ఎక్కడ కలుపుకుందో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ!
Comments
Please login to add a commentAdd a comment