టారో : 8 అక్టోబర్‌ నుంచి 14అక్టోబర్‌2017 వరకు | Tarot: from 8 October to 14 October 2012 | Sakshi
Sakshi News home page

టారో : 8 అక్టోబర్‌ నుంచి 14అక్టోబర్‌2017 వరకు

Published Sun, Oct 8 2017 11:19 AM | Last Updated on Sun, Oct 8 2017 11:19 AM

Tarot: from 8 October to 14 October 2012

మేషం (మార్చి 21 ఏప్రిల్‌ 19)
మీ శక్తినంతా పని మీదే∙కేంద్రీకరించండి. ప్రేమ విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. జాగ్రతగా వ్యవహరించండి. పని ఒత్తిడి పెరిగిపోయి ఉత్సాహం కోల్పోతారు. కొత్త శక్తిని తెచ్చుకొని పనిచేయండి. ఒకటి రెండు రోజులపాటు సెలవుపై వెళితే బాగుంటుంది. మీ ఉన్నతికి తోడ్పడే అంశాలు ఏంటో బలంగా నమ్ముతూ ఆ వైపుగా అడుగులు వేయండి. వృత్తి జీవితంలో కీలక మార్పులు కనిపిç        Ü్తున్నాయి.
కలిసివచ్చే రంగు : ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కే సమయమిది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఒక కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తుంది. కొత్త బాధ్యతలను చేపట్టడంలో చనువు చూపండి. అందరినీ సమానంగా చూడడం అనే మీ ఆలోచనే మిమ్మల్ని గొప్ప శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి.
కలిసివచ్చే రంగు : ఎరుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వెళ్లొచ్చు. జాగ్రత్తగా ఉండండి. రోజూ వ్యాయామం చేయండి. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సేపు మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీ ఆలోచనల్లో మార్పు రావడంతోనే అంతా మంచి జరుగుతుందన్నది నమ్మండి. జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. ఇది మీరు ఊహించని మార్పులు తెచ్చిపెడుతుంది.
కలిసివచ్చే రంగు : బూడిద

కర్కాటకం (జూన్‌ 21 జూలై 22)
మీకు అన్నివిధాలా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టే సమయమిది. ఆత్మ విశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. మీరు కలలుగన్న జీవితం ఎంతో దూరంలో లేదు. అందరినీ కలుపుకుంటూ, మీదైన శైలిలో పనిచేసుకుంటూ వెళితే విజయం మీదే. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ పాత పద్ధతులు కొన్ని మార్చుకుంటే మరింత బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : నలుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీకు ముందున్నవన్నీ మంచి రోజులే. ఊహించని విజయాలతో మీ స్థాయి మరింత పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం కుదుర్చుకోండి. మీదైన ఆలోచనలున్న వ్యక్తులతో ఒక సమూహంగా ఏర్పడి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీకు దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గరవుతారు. వారితో ఒక విహారయాత్రకు కూడా సన్నాహాలు చేస్తారు. పనిలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. ఇదే మీ ఉన్నతికి అడ్డుగా మారిన అంశం అని నమ్మండి. ఒక అడుగు వెనక్కి వేసి గతంలో చేసిన తప్పులను బేరీజు వేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఎలా ఆలోచించవచ్చో చూడండి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. వాయిదా వేస్తూ వచ్చిన పనులను మొదలుపెట్టాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రస్తుతానికి పెట్టుబడుల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : నారింజ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితంలో కొన్ని అనుకోని మార్పులు సంభవించనున్నాయి. కాస్తంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. పరిస్థితులన్నీ మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. గందరగోళంగా ఉంటుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పని చేయండి. జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రేమ జీవితంలోనూ కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కొత్త విషయమేదైనా నేర్చుకునేందుకు ప్రయత్నించండి.
కలిసివచ్చే రంగు : లేత గులాబీ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీ ఆలోచన విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఇదే. పాతబడ్డ మీ సిద్ధాంతాలను వదిలి కొత్తగా ఆలోచించండి. మీ కొత్త ఆలోచనలే కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటే విజయం మీ వెన్నంటే ఉంటుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులుæ ఎదురైనా అవన్నీ మీ మంచికే అనుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి.
కలిసివచ్చే రంగు : గులాబీ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆహ్లాదకరమైన జీవితం గడుపుతారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నీ విజయవంతం అవుతాయి. మీ మానసిక ఉల్లాసం కోసం సమయం వెచ్చించడం ఎంతో అవసరం. వీలునుబట్టి విహార యాత్రకు వెళ్లండి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు పెడతారు.
కలిసివచ్చే రంగు : తెలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. సానుకూల దృక్పథంతో అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో పని చేయండి. విజయం మీదేనన్న విషయం మరవకండి. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి పట్ల నమ్మకంతో మెలగండి. ప్రేమను వ్యక్తపరచడంలో ఆలస్యం చేయొద్దు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మీ శక్తినంతా కేంద్రీకరించి ఇప్పట్నుంచే శ్రమించడం మొదలుపెట్టండి.
కలిసివచ్చే రంగు : పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నిరాశలోకి కూరుకుపోకండి. మిమ్మల్ని మీరు ఎందుకు సంతోషంగా ఉంచుకోలేకపోతున్నారో ఆలోచించండి. మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం ఇదే. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి. అన్ని విషయాల పట్ల నిరుత్సాహం కనబరుస్తూ మీ ఉన్నతికి మీరే అడ్డుకట్ట వేసుకుంటున్నారు. మీ ఇబ్బందులన్నీ దాటించగలిగే మార్గం ఆలోచనా విధానం మార్చుకోవడమే. విజయంపై ధీమా అవసరం.
కలిసివచ్చే రంగు : వైలెట్‌

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
చాలాకాలంగా జీవితమంతా ఒకదగ్గరే ఆగిపోయినట్టు ఉంది. ఇంకొన్ని రోజులు కూడా ఈ పరిస్థితి మారేలా లేదు. మీరు ఏం కోరుకుంటున్నారో, మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో, దానికి మీరేం చేయాలో, చేయగలరో నిరంతరం ఆలోచిస్తూ ఉండండి. ఆ ఆలోచనలోనే మీ విజయం దాగుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement