సిటీలో ‘హాట్‌స్టోరీ’ | Hot story in Hyderabad City | Sakshi
Sakshi News home page

సిటీలో ‘హాట్‌స్టోరీ’

Published Sat, Jul 12 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

సిటీలో ‘హాట్‌స్టోరీ’

సిటీలో ‘హాట్‌స్టోరీ’

 సినిమాకు వెళ్లేముందు అది ఒక హాట్ స్టోరీ. సినిమా చూసేటప్పుడు హేట్ స్టోరీ. థియేటర్‌లో నుంచి బయటికొచ్చాక అది ఓ హీట్ స్టోరీ. ఇంతకీ అసలు స్టోరీ ఏంటీ అనుకుంటున్నారా? ఇదే ప్రశ్న హేట్‌స్టోరీ 2 టీం ని అడిగితే వచ్చిన సమాధానం ఇది. ‘హేట్‌స్టోరీ 2’ నట బృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం ది పార్క్ హోటల్‌లో మీడియాతో ముచ్చటించారు. తమ సినిమా హేట్ స్టోరీకి సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ కాదు.
 
 ఇదో రివెంజ్ మూవీ. ఏ సినిమాలో లేని భిన్నమైన కోణాలు హేట్‌స్టోరీ 2 లో ఉన్నాయని చెప్పారు నటులు జయ్‌భానుశాలి, సుశాంత్ సింగ్, సుర్లీన్ చావ్లా. శృంగార సన్నివేశాలు తమ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్భయంగా ప్రకటించారు. అలాగని ఎక్కడా శ్రుతి మించలేదని చెప్పుకొచ్చారు. కథకు తగ్గట్టుగా సన్నివేశాలను డెరైక్టర్ చక్కగా మలిచారన్నారు. డాన్‌శీను సినిమాలో జిన్నాభాయ్‌గా తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన సుశాంత్ సింగ్ టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలలో నటించాలన్న తన కోరికను వెలిబుచ్చారు.

‘డాన్‌శీనులో నా నటనకు మంచి ఆదరణ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజతోనే తిరిగి దరువు చిత్రంలో నటించా. మీడియా ద్వారానైనా ఈ విషయం డెరైక్టర్లకు తెలియాలనే చెప్తున్నా. తెలుగంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నటించాలని కూడా ఉంది. అందుకే అవకాశమివ్వండి. నేను కూడా షయాజీ షిండే లాగా పేరు తెచ్చుకోవాలి. ఆయనలా.. ఇక్కడే ఒక ఫాం హౌజ్ కట్టుకోవాలి’ అన్నాడు సుశాంత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement