Jay Bhanushali
-
బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..
పెళ్లయిన ప్రతి దంపతులకు ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? లేదా ఎంతమంది పిల్లలు? ఈ ప్రశ్న నుంచి తప్పించుకోని దంపతులు లేరంటే అతిశయోక్తి కాదు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పవు. బుల్లితెర స్టార్స్ మహి విజ్-జై భానుశాలి కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అన్న ప్రశ్న వారికీ ఎదురైంది. ఒకరకంగా చెప్పాలంటే వారు కూడా సంతానం కోసం ఎంతో ఎదురుచూశారు. కానీ పిల్లలు కావాలన్న వారి కోరిక ఫలించలేదు. సంతానం కోసం ఐవీఎఫ్ దీంతో 2019లో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఎంచుకున్నారు. ఈ విధానం ద్వారా మహి గర్భంలో కవలలను ప్రవేశపెట్టారు. తమ సంతోషం రెట్టింపు కానుందని సంబరపడేలోపే వారి ఆనందం ఆవిరైంది. ఒక పాపాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మరో పాప మాత్రం ఆరోగ్యంగా జన్మించింది. తాజాగా ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకుంది మహి విజ్. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ ఆమె మాట్లాడుతూ.. 'సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. తొలి ప్రయత్నం విజయవంతం కాలేదు. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగో ప్రయత్నంలో విజయవంతమైంది. ఈ గుడ్‌న్యూస్ నాకు ముందుగా నా భర్త చెప్పాడు. అప్పటికే నేను పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. సోనోగ్రఫీ కోసం మాత్రమే బయటకు వెళ్లేదాన్ని. మిగతా సమయాల్లో నర్సే ఇంటికి వచ్చి ఇంజక్షన్స్ ఇచ్చేది. నేను అప్పుడు చాలా సైలెంట్ అయిపోయాను. బయట ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసుకున్నాను. కవలల్లో ఒకరు కన్నుమూత ఐవీఎఫ్ వల్ల కవలలు పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఒక పాప ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఒకరకంగా మంచే జరిగిందన్నారు. చాలా సందర్భాల్లో కవలల్లో ఒకరు చనిపోయేలా ఉంటే మిగతా ఒకరు కూడా మరణించే అవకాశాలే ఎక్కువన్నారు. కానీ మిగతా పాపకు ఏం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కనీసం ఒక్కరైనా మాకు దక్కారని సంతోషించాం' అని చెప్పుకొచ్చింది. కాగా మహి-జై 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు 2019లో తారాకు జన్మనిచ్చారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: విజయ్ దేవరకొండ షర్ట్‌తో కనిపించిన రష్మిక.. మళ్లీ దొరికిపోయిందిగా ఈ శుక్రవారం ఓటీటీలో 22 సినిమాలు -
ఇండియన్ ఐడల్ : యాంకర్ మారడానికి కారణం అదేనా?
ముంబై : ఇండియన్ ఐడల్ రియాలిటీ షో దేశ వ్యాప్తుంగా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్నటి షోలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ అందాల తార రేఖ వచ్చారు. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేశారు. అయితే ఈ షోకు మొదటి నుంచి ఆదిత్య నారాయణ్ యాంకర్‌గా ఉన్నారు. అలాంటిది సడెన్‌గా ఆదిత్య నారాయణ్ స్థానంలో జయ్ భానుశాలి కనిపించారు. దీంతో అసలు ఆదిత్య నారాయణ్‌ను ఏమైంది? సడెన్‌గా హోస్ట్‌ను ఎందుకు మార్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిత్యను ఎవరూ రీప్లేస్ చేయడం లేదని, కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఆయన స్థానంలో జయ్ భానుశాలి ఉంటారని తెలుస్తుంది. ఈ మార్పులన్నింటికీ కారణం కరోనా వైరస్ అని తేలింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యాంకర్ ఆదిత్య నారాయన్‌కు సైతం కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆదిత్య నారాయణ్‌తో పాటు ఆయన భార్య శ్వేతా అగర్వాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆదిత్య నారయణ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు..ప్రస్తుతం కరోనా కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కొత్త దంపతుతు త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు నెటిజన్లు సహా ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ జడ్జిలో ఒకరైన నేహా కక్కర్ సైతం కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ భార్యను ఏడిపించిన సింగర్ -
వాళ్లను వదిలేయలేదు.. ముగ్గురూ సమానమే: నటి
ముంబై: దత్తత తీసుకున్న పిల్లల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కన్న కూతురితో సమానంగా వాళ్లకు ప్రేమను పంచుతున్నామన్నారు టీవీ నటి మహి విజ్. వాళ్లను వదిలేశామని, పట్టించుకోవడం లేదన్న వార్తలు తమను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2011లో వివాహ బంధంతో ఒక్కటైన హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. ఈ క్రమంలో 2017లో తమ పనిమనిషి పిల్లల(రాజీవ్, ఖుషి)ను దత్తత తీసుకున్నారు. అయితే, తొలుత కొన్నాళ్లపాటు వీరి ఇంట్లోనే ఉన్న రాజీవ్, ఖుషి తర్వాత కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నారు. మహి- జై వారి ఆ చిన్నారుల పెంపకం, విద్యకు సంబంధించిన ఖర్చులు భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూతురు తార(2 ఏళ్లు) పుట్టిన తర్వాత ఈ జంట, రాజీవ్- ఖుషిలను పూర్తిగా వదిలేశారని, వారికి దూరంగా ఉంటున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్థార్థపరులైన మహి- జైలను ఇకపై ఫాలో అవ్వమంటూ విద్వేషపు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మహి విజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు.. ‘‘చాలా మంది రాజీవ్, ఖుషిలను వదిలేశారా అని అడుగుతున్నారు. మేం వాళ్లకు తల్లిదండ్రులం. వారి బాగోగులు చూసుకునే బాధ్యత మాపై ఉంది. తార వచ్చిన తర్వాత మా జీవితాలు మరింత అందంగా మారాయి. రాజీవ్, ఖుషీలకు మరో తోడు దొరికింది. అంతేకానీ వారి ముగ్గురి పట్ల మా ప్రేమలో ఎలాంటి తేడా లేదు. వాళ్లు ప్రస్తుతం వారి స్వస్థలంలో ఉన్నారు. మేం రోజూ వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాం. వారి సౌకర్యాన్ని బట్టి నచ్చిన సమయంలో నచ్చిన చోట ఉంటారు. పండుగలన్నీ మేమంతా కలిసే చేసుకుంటాం. మాకు ముగ్గురు పిల్లలు అన్న విషయం ఎన్నటికీ మర్చిపోం. వాళ్లకు మీ ఆశీర్వాదాలు కావాలి. అంతేగానీ, మా ప్రేమను శంకించవద్దు. దయచేసి, మా వ్యక్తిగత జీవితం గురించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మహికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత అంటే, 2019లో మహి- జైకి కూతురు తార జన్మించింది. ఇక వీరిద్దరు టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకుని ప్రాచుర్యం పొందారు. కాగా తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా మహి విజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది! చదవండి: 16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?! View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) -
‘ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఇవ్వలేను’
‘ఈ ఏడాది నీ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుపాలనుకున్నాను. మన రాజకుమారి కంటే గొప్పదైన బహుమతిని నీకు ఎన్నటికీ ఇవ్వలేను. లవ్ యూ తారా. ఈ ఏడు నీకు గొప్పగా ఉండాలని అమ్మ కోరుకుంటోంది. ఈరోజు నీ చిన్నారితో.. హ్యాపీ బర్త్‌డే లవ్. జై భనుశాలి’ అంటూ మోడల్, టీవీ నటి మహి విజి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ గారాలపట్టి తార ఫొటోను మొదటిసారిగా అభిమానులతో పంచుకున్నారు. జై సైతం.. తన కూతురి ఫొటోను పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. ‘ మా టెడ్డీబేర్, నా జీవితం, నా ఆత్మ, నా సంతోషానికి స్వాగతం పలకండి. మీ మొదటి శ్వాస మమ్మల్ని ఆనందంలో ముంచెత్తింది. తన చిట్టి చిట్టి చేతులు, పొట్టి పాదాలు నా హృదయాన్ని దోచుకున్నాయి’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు 2011లో వివాహం జరిగింది. ఈ క్రమంలో 2017లో ఈ జంట తమ పనిమనిషి కూతురిని దత్తత తీసుకున్నారు. అయితే ఆమె కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నా తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇక పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత 2019, ఆగస్టులో వీరికి కూతురు తార జన్మించింది. మహి- జై జంట టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా మహి విజి తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించారు. View this post on Instagram Happy birthday @ijaybhanushali this year I thought of making your birthday even more special.We love you @tarajaybhanushali n mumma wish u the best year ahead 2020.i couldnt have give you a better gift thn our lil princess this day with your lil one.happy birthday love 💓 ❤️❤️❤️⭐️💋pic credit - @thelooneylens A post shared by Mahhi ❤️tara (@mahhivij) on Dec 24, 2019 at 9:55pm PST -
‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్’
‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మేము కోరుకున్నాము. నువ్వు ఇక్కడ ఉన్నావు. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మేము పరిపూర్ణమయ్యాము. నేను కోరుకున్న అన్నింటితో పాటు ప్రత్యేకమైన ఈ కానుక ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. నా బెస్టీ ఇక్కడ ఉంది. నా జీవితం మార్చేసింది’ అంటూ మోడల్, టీవీ నటి మహి విజి తాను తల్లిని అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కూతురి పాదాలను ముద్దాడుతున్న భర్త ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి మహి విజి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు 2011లో వివాహం జరిగింది. ఈ క్రమంలో 2017లో ఈ జంట తమ పనిమనిషి కూతురిని దత్తత తీసుకున్నారు. అయితే ఆమె కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నా తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇక పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారడంతో ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కూతురి రాక గురించి జై చెబుతూ...’మా భవిష్యత్తు ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చింది. మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజకుమారి’ అంటూ ఓ ఆత్మీయ సందేశాన్ని పోస్ట్ చేశాడు. కాగా మోడల్ అయిన మహి పలు హిందీ సీరియళ్లలో నటించి అవార్డులు పొందారు. తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. అదే విధంగా జై కూడా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించే సీరియళ్లలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మహి- జై జంట టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నారు. View this post on Instagram Twinkle twinkle little star we made a wish and here you are.thank you for choosing us as your parents.we feel complete.We are blessed with baby girl 👧 ❤️💋🙏thank u god for everything this one is special thank you.We feel blessed.My best friend is here.Meri zindagi Badal di 🙏🙏🙏🙏 A post shared by Mahhi Jay❤️bhanushali (@mahhivij) on Aug 20, 2019 at 9:35pm PDT -
సిటీలో ‘హాట్‌స్టోరీ’
సినిమాకు వెళ్లేముందు అది ఒక హాట్ స్టోరీ. సినిమా చూసేటప్పుడు హేట్ స్టోరీ. థియేటర్లో నుంచి బయటికొచ్చాక అది ఓ హీట్ స్టోరీ. ఇంతకీ అసలు స్టోరీ ఏంటీ అనుకుంటున్నారా? ఇదే ప్రశ్న హేట్‌స్టోరీ 2 టీం ని అడిగితే వచ్చిన సమాధానం ఇది. ‘హేట్‌స్టోరీ 2’ నట బృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం ది పార్క్ హోటల్లో మీడియాతో ముచ్చటించారు. తమ సినిమా హేట్ స్టోరీకి సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ కాదు. ఇదో రివెంజ్ మూవీ. ఏ సినిమాలో లేని భిన్నమైన కోణాలు హేట్‌స్టోరీ 2 లో ఉన్నాయని చెప్పారు నటులు జయ్భానుశాలి, సుశాంత్ సింగ్, సుర్లీన్ చావ్లా. శృంగార సన్నివేశాలు తమ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్భయంగా ప్రకటించారు. అలాగని ఎక్కడా శ్రుతి మించలేదని చెప్పుకొచ్చారు. కథకు తగ్గట్టుగా సన్నివేశాలను డెరైక్టర్ చక్కగా మలిచారన్నారు. డాన్‌శీను సినిమాలో జిన్నాభాయ్గా తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన సుశాంత్ సింగ్ టాలీవుడ్లో మరిన్ని సినిమాలలో నటించాలన్న తన కోరికను వెలిబుచ్చారు. ‘డాన్శీనులో నా నటనకు మంచి ఆదరణ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజతోనే తిరిగి దరువు చిత్రంలో నటించా. మీడియా ద్వారానైనా ఈ విషయం డెరైక్టర్లకు తెలియాలనే చెప్తున్నా. తెలుగంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నటించాలని కూడా ఉంది. అందుకే అవకాశమివ్వండి. నేను కూడా షయాజీ షిండే లాగా పేరు తెచ్చుకోవాలి. ఆయనలా.. ఇక్కడే ఒక ఫాం హౌజ్ కట్టుకోవాలి’ అన్నాడు సుశాంత్.