ఛాందోగ్య ఉపనిషత్
జ్యోతిర్మయం
ఛాందోగ్య ఉపనిషత్ సామవేదానికి సంబంధించి నది. తాత్విక సిద్ధాంతాన్ని ఊరికే చెప్పకుండా చిన్న చిన్న కథలను జోడించి చెప్పటం చాలా ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఈ విషయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నన్ని కథలు మరేదాంట్లోనూ లేవు. వాటిల్లో రెండు కథలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
ఒకప్పుడు సత్యకాముడు అనే కుర్రవాడు తన తల్లిని అడిగాడు. ‘అమ్మా! నేను గురువుగారి దగ్గర ఉండి చదువుకుందామనుకుంటున్నాను. నా గోత్రమే మిటి? అందుకు సమాధానంగా ఆమె అన్నది. ‘నాయ నా నీ గోత్రమేమిటో నాకు తెలియదు. నేను వయసులో ఉండగా పరిచారికగా ఉన్నాను. ఆ కాలంలో నిన్ను నేను కన్నాను. అదట్లా అవటం వల్ల నీ గోత్రం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను. అయినా గాని, నా పేరు జబాల. నీ పేరు సత్యకాముడు. కాబట్టి నిన్ను నీవు ‘సత్యకామ జాబాల’ అని చెప్పుకో’.
ఆ కుర్రవాడు హారిద్రుమత గౌత ముని వద్దకు వెళ్లి ‘అయ్యా! మీ దగ్గర చదువుకోవాలని ఉంది. అనుమతి స్తారా? అని అడిగాడు. గౌతముడు, ‘ముందు నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు. ‘అయ్యా! నా గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా తల్లిని అడిగితే ఇలా చెప్పింది’ అని చెప్పి చివరగా అన్నాడు ‘అందు వల్ల నేను సత్యకామ జాబాలిని’. అది విన్న గురువు గారు అన్నారు. ‘నిన్ను నేను శిష్యుడుగా అంగీకరిస్తు న్నాను. ఎందుకంటే నీవు సత్యం నుండి వైదొలగలేదు’.
రెండో కథ: ఒకప్పుడు జానశృతి అనే రాజు ఉండే వాడు. అతడు ఎన్నో దానాలు చేశాడు. ఎందరికో ఆకలి తీర్చాడు. ఉండటానికి సత్రాలు కట్టించాడు. అతను అనుకొంటూ ఉండేవాడు, ‘అంతటా జనం నన్ను గురించే గొప్పగా చెప్పుకుంటారు’.
ఓ రాత్రివేళ కొన్ని హంసలు పైన ఎగురుతూ వెళ్లాయి. వాటిల్లో ఒక హంస ఇంకో హంసతో అన్నది. ‘ఈ జానశృతి కీర్తి అనే తేజస్సు పట్టపగలు వెలిగినట్లు వెలుగుతోంది. దగ్గరగా బోకు, కాలిపోతావు’. ఆ ఇం కో హంస అన్నది, ‘‘ఇతను ఏమైనా బండి తోలుకొని జీవించే రైక్వుడా, అంతగా పొగుడుతున్నావు?’’ జాన శృతి ఈ మాటలు విన్నాడు. బండి తోలే రైక్వుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకు రమ్మని సేవకుణ్ణి పురమాయిం చాడు. సేవకుడు వెతికాడు కాని రైక్వుడు ఎక్కడ ఉం డేదీ కనిపెట్టలేకపోయాడు. జానశృతి చెప్పాడు, ‘బ్రహ్మ జ్ఞానిని ఎక్కడ వెతకాలో అక్కడ వెతుకు! సేవకుడు ఈ సారి వెతగ్గా రైక్వుడు బండి కింద కూర్చొని ఒంటి మీద పొక్కులు గోక్కుంటూ కనిపించాడు. జానశృతి చాలినన్ని బహుమతులు గురుదక్షిణగా పట్టుకెళ్లి, ప్రతిగా తాను కోరుకున్న బ్రహ్మజ్ఞానాన్ని బండి రైక్వుడి నుండి పొందినాడు.
రెండు కథల్లోను పైకి కనిపించే అర్థం అంతము ఖ్యమైనది కాదు. అంతరార్థమే అసలు తెలుసుకోవల సింది. నాలుగు మహావాక్యాల్లో ఒకటైన ‘తత్త్వ మసి’ ఈ ఉపనిషత్తులోంచే గ్రహించబడింది.
దీవి సుబ్బారావు